Read more!

భాస్కర దండకమ్ (Bhaskara Dandakam)

 

భాస్కర దండకమ్

(Bhaskara Dandakam)

 

ఓం శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షామణి దైవచూడామణి యాత్మరక్షామణీ త్వం నమోపాపశిక్షా, నమో విశ్వభర్తా నమో విశ్వకర్తా నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథా మహాభూత భేదంబులున్నీవయై, బ్రోతువెల్లప్పుడన్ భాస్కరా! పద్మినీ వల్లభా, గానలోలా త్రిమూర్తి స్వరూపా విరూపాక్షనేత్రా, మహా దివ్యగాత్రా, అచింత్యావతారా, నిరాకార, ధీరా పరాకయ్య మోయయ్య తాపత్రయా భీలదావాగ్ని రుద్రాతనూద్భూత మింపార గంభీర సంభావితానేక కామాద్యనేకంబులుందాక నేకాకినై చిక్కి, యేదిక్కున నుంగానగాలేక యున్నాడ, నీవాడనో తండ్రి జేగీయమానా కటాక్షంబులన్ నన్ను గృపాదృష్టి వీక్షించి వేగన్ మునీంద్రాది వంద్యాజగన్నేత్రమూర్తీ ప్రచండ స్వరూపుండవైయొంటి సారధ్యమున్ గుంటి యశ్వంబులేడింటినిన్నొంటి చక్రంబుదాల్చి మార్తాండ రూపుండవై చెండవా రాక్షసాధీశులన్ గాంచి కర్మానుసారంబుగా దోషజాలంబులన్ ద్రుంచి కీర్తిన్ అప్రతాపంబులన్ మించి, నీ దాసులంగాచి యిష్టార్దముల్ గూర్తువో దృష్టివేల్పా! మహాపాప కర్మాలకున్నాలయంబైన యీ దేహభారంబైనా భారంబుగానీక శూరోత్తమా మోప్పులుంతప్పులుంనేరముల్ మాని సహస్రంశువైనట్టి నీ కీర్తి కీర్తింపనేనేర్తునా ద్వాదశాత్మా దయాళుత్వాన్ జూపినాయాత్మ భేడంబులన్ బాపి పోషింప నీవంతునిన్ శేషబహాషాధిపుల్ పొగడగాలేరు నీ దివ్యరూప ప్రభావంబు గానంగ నేనెంత మొల్లప్పుడన్ స్వల్ప జీవుండనౌదున్ మహాకష్టుడన్ నిష్టయున్ లేదు నీ పాదపద్మంబులేసాక్షి దుశ్చింతలన్ బాపి నిశ్చింతతన్ చేయవే కామితార్ధ ప్రదాయీ మహిన్ నిన్ను గీర్తించి ఎన్నన్ మహాజన్మ జన్మాంతర వ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్ధముల్ కొంగుబంగారు తంగేడు జున్నయి ఫలించున్ భాస్కరా ద్యుతే సమస్తే నమస్తే నమః