Read more!

Surya Bhagavan gives glow

 

జగతికి వెలుగు సూర్యుడు

Surya Bhagavan gives glow

 

అదితి, కశ్యపుల కుమారుడు సూర్యుడు. సూర్యుని భార్య సంజ్ఞ. వీరిరువురి సంతానం యముడు, యమున. సూర్యుని వేడిని తాళలేక తన లాంటి రూపమున్న స్త్రీని సృష్టించి సూర్యుని వద్ద ఉంచి, అశ్వ రూపంలో అడవులకు వెళ్ళిపోతుంది సంజ్ఞ.

 

అశ్వరూపంలో ఉన్నప్పుడు ఆమెకు జన్మించిన వారే అశ్వనీదేవతలు. సూర్యుని వద్ద మారురూపంలో ఉన్న స్త్రీ ఛాయ. వీరి సంతానం శని, సావర్ణి, తపతి. మోహినీ అవతారంలో విష్ణుమూర్తి రాక్షసులకు అమృతము పంచుతూ, దేవతల రూపంలో ఉన్న రాహుకేతువులకూ అమృత మిచ్చినప్పుడు దానిని సూర్యుడు, చంద్రుడు గుర్తిస్తారు. ఆ విషయం విష్ణుమూర్తికి చెప్పగా, అతడు సుదర్శనంతో రాహుకేతువుల శిరస్సులు ఖండిస్తాడు.

 

సూర్య చంద్రులపై పగబూనిన రాహుకేతువులు అప్పుడప్పుడూ సూర్యుడినీ, చంద్రుడినీ మింగడానికి ప్రయత్నించడం వల్ల గ్రహణాలు వస్తాయని పురాణాల కథనం. మహాభారతంలో కుంతికి సూర్యునికి జన్మించిన వాడే కర్ణుడు. ఇంకా సూర్యుని గురించి పురాణాలలో అనేక సందర్భాలలో కనిపిస్తుంది.