Read more!

పితృదేవోభవ ‘ఫాదర్స్ డే ’ స్పెషల్

 

 

పితృదేవోభవ


‘ఫాదర్స్ డే ’ స్పెషల్

                                                                        మాతృదేవోభవ...పితృదేవోభవ...ఆచార్యదేవోభవ...అతిథిదేవోభవ....
ఈ నాలుగు సూత్రాలు ఆర్షధర్మ సౌధానికి మూలస్తంభాలు. పుట్టిన బిడ్డ ఎవ్వరూ చెప్పకుండానే తల్లిని గుర్తిస్తుంది. ఆ బిడ్డకు తండ్రిని పరిచయం చేస్తుంది తల్లి. ఆ తండ్రి  తన బిడ్డకు ఆచార్యుని (గురువును) పరిచయం చేస్తాడు. ఆ గురువు ఆ బిడ్డకు ఆశ్రమ ధర్మాలు బోధించి. జీవితసత్యాన్ని తెలియచేస్తాడు.
నిజానికి ప్రతి బిడ్డకు తండ్రే తోలిగురువు. తండ్రికి ఆచార్యుడు అని మరో పేరు కూడా ఉంది. ఏ విదంగా.. అనే సందేహం కలగవచ్చు. గాయత్రి మంత్రోపదేశం చేసి ఆధ్యాత్మికజ్యోతిని దర్శింపచేసే తొలి గురువు తండ్రే. మరి ఉపనయన సంస్కారంలేని వారి మాటకు వస్తే.. అక్షరాభ్యాస సమయంలో బిడ్డను తన కుడి తొడమీద కూర్చోపెట్టుకుని తొలిసారిగా అక్షరాలు దిద్దించేది తండ్రే. బిడ్డ అభివృద్ధికి తన జీవితాన్ని సోపానాలుగా పరుస్తాడు తండ్రి. బిడ్డ ఎన్ని తప్పులు చేసినా తల్లి క్షమించినట్టుగా తండ్రి క్షమించడు. తండ్రికి బిడ్డ అభివృద్ధే ప్రధానం.. ఈ విషయంలో తన పితృప్రేమను కూడా బలవంతంగా అణచివేస్తాడు. ఇది భౌతిక ప్రపంచంలో తండ్రి పాత్ర.

ఇక ధర్మశాస్త్ర దృష్ట్యా తండ్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అదే ప్రాచీన వైదిక యుగంలో... వివాహ వ్యవస్థ లేని కాలంలో...స్త్రీ, పురుషుల మద్య ఉండే శరీర సంబంధాలన్నీ ధర్మబధ్ధంగానే పరిగణలోకి తీసుకోబడేవి. అయితే ఆమెకు పుట్టిన సంతానం బాధ్యత, మంచి చెడ్డలు తల్లే భరించేది. తండ్రికి ఏ విధమైన బాధ్యత ఉండేది కాదు. ఆ వ్యవస్థలో తల్లే ఆ కుటుంబానికి యజమానురాలు. అది ‘మాతృస్వామ్యవ్యవస్ధ’. అయితే ఆ కాలంలో స్త్రీకి రక్షణ ఉండేది కాదు. అప్పుడే వివాహ వ్యవస్థ ఏర్పడింది.

ఈ వ్యవస్దకు ఆధ్యుడు ఋచీకుడు అనే  ముని కుమారుడు. తన తల్లి మీద పరాయి వ్యక్తి చేస్తున్న అత్యాచారానికి ఏ మాత్రం నైతిక బాధ్యత వహించని తన తండ్రిని చూసి.. సమాజానికి ‘వివాహం’ చాలా అవసరం అని గుర్తించి వివాహవ్యవస్థను ఏర్పరచాడు ఋచీకుడు.అప్పటికే ఆనాటి సమాజంనానాజాతి సంతానంతో నిండిపోయింది.  ఎవరెవరు ఎవరికి పుట్టారో  గుర్తించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు సమాధానంగా ఆయా ఋషుల పేర్లు చెప్పారు ఆయా తల్లులు. ఆ విధంగా గోత్రాలు ఏర్పడ్డాయి. నాటి నుండి తల్లి తండ్రుల బంధాలనీ., సోదరీ సోదర బంధాలనీ ఏర్పడ్డాయి. కుటుంబానికి రక్షకుడుగా తండ్రి నిలబడ్డాడు..అన్ని బాధ్యతలు స్వీకరించాడు.

- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం

 

2015 Father's Day Special Short Film

2015 Father's Day Special Short Film2015 Father's Day Special Short Film