బాలచంద్ర సంకష్ట చతుర్థి.. ఈ రోజు విశిష్టత ఏమిటంటే!

 

బాలచంద్ర సంకష్ట చతుర్థి.. ఈ రోజు విశిష్టత ఏమిటంటే!


విఘ్నాలు తొలగించే వినాయకుడిని వినాయక చవితి రోజునే కాకుండా  ప్రతి మాసంలో వచ్చే సంకటష్ట చతుర్థి రోజున కూడా పూజిస్తారు. ప్రతి మాసంలో కృష్టపక్ష చతుర్థినే సంకట హర చతుర్థి లేదా సంకష్ట చతుర్థి అని జరుపుకుంటారు.  ఈ రోజు వినాయకుడిని ఆరాధించడం వల్ల ఎలాంటి సమస్యల నుండైనా బయటపడవచ్చని,  వినాయకుడి అనుగ్రహం వల్ల ఎంత సమస్యలైనా పరిష్కారం అవుతాయని చెబుతారు. అయితే పాల్గొన మాసంలో వచ్చే సంకట హర చతుర్థిని బాల చంద్ర సంకష్ట చతుర్థిగా జరుపుకుంటారు.  ఈ రోజు ప్రత్యేకత ఏమిటి? ఈ రోజున వినాయకుడిని పూజీంచడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే..

బాలచంద్ర సంకష్ట చతుర్థి..

హిందూ  పంచాంగం ప్రకారం, పాల్గున మాసం,  కృష్ణ పక్షచతుర్థి తిథిన బాలచంద్ర సంకష్ట చతుర్థి జరుపుకుంటారు.   మార్చి 6వ తేదీ శుక్రవారం సాయంత్రం 5:57 గంటలకు ప్రారంభమై మార్చి 7వ తేదీ శనివారం సాయంత్రం 7:21 గంటలకు ముగుస్తుంది. సంకష్టి చతుర్థి ఉపవాసం చంద్రోదయ సమయంలో చతుర్థి తిథి ఉండాలి, ఎందుకంటే చంద్రోదయం తర్వాత మాత్రమే ఉపవాసం విరమించబడుతుంది. మార్చి 6వ తేదీ రాత్రి చంద్రోదయం జరుగుతుంది,  ఆ సమయంలో చతుర్థి తిథి ఉంటుంది, కాబట్టి మార్చి 6వ తేదీన ఉపవాసం పాటించబడుతుంది.

బాలచంద్రుడు..

పాల్గున మాసంలో వచ్చే సంకష్ట చతుర్థి రోజు వినాయకుడిని బాలచంద్రుడి రూపంలో ఆరాధిస్తారు.  ఈరోజు ఆయన బాలచంద్రుడిగా దర్శనం ఇస్తాడు. ఆయన తలమీద చిన్న చంద్రకళ ఉంటుందట. అందుకే ఈ రూపానికి బాలచంద్రుడు అని పేరు వచ్చింది.

ఆరాధన..

సాధారణంగా ప్రతి సంకష్ట చతుర్థికి ఎలాగైతే ఉపవాసంతో వ్రతం ఆచరిస్తారో.. అదే విధంగా బాలచంద్ర గణపతిని కూడా ఆరాధిస్తారు.

                               *రూపశ్రీ.