ఇంటి గుమ్మంలో గణపతి విగ్రహం ఉంచుతున్నారా.. ఈ నియమాలు తెలుసా!
ఇంటి గుమ్మంలో గణపతి విగ్రహం ఉంచుతున్నారా.. ఈ నియమాలు తెలుసా!
హిందూ మతంలో తొలి దైవంగా భావిస్తారు. ఏదైనా శుభ కార్యం ఆయన ఆరాధనతో ప్రారంభమవుతుంది. దీని వల్ల తలపెట్టిన పని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని నమ్ముతారు. అంతేకాదు.. జీవితంలో, కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు, అదృష్టం కోసం , చాలామంది తమ ఇంటి గుమ్మం దగ్గర గణేశుడి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఉంచుతారు. అయితే వాస్తు శాస్త్రం, పురాణాల ప్రకారం, ప్రధాన ద్వారం వద్ద గణేశుడి విగ్రహాన్ని ఉంచేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలట. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని చెబుతారు. గణేశుడు శుభ్రప్రదం చేకూర్చే వాడు, అయితే ఆయన్ను ఇంటి గుమ్మం దగ్గర ఉంచడంలో జరిగే ఒక చిన్న పొరపాటు సానుకూల శక్తికి బదులు ప్రతికూల శక్తిని కలిగిస్తుందట. అందుకే ఇంటి గుమ్మం దగ్గర గణేశుడి విగ్రహాన్ని ఉంచేటప్పుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలని చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే..
గణేశుడి శరీర భాగాలు, వాటి శక్తులు..
పురాణాల ప్రకారం గణేశుడి శరీరంలోని వివిధ భాగాలలో వివిధ శక్తులు నివసిస్తాయని నమ్ముతారు. గణేశుడి పొట్ట ఆ విశ్వానికి సూచిక అని చెబుతారు. ఆయన పొట్టలో ఈ బ్రహ్మాండం ఉంటుందట. ఆయన తల జ్ఞానాన్ని నింపుకుని ఉంటుంది, అలాగే ఆయన వీపు పేదరికం అంటే అలక్ష్మీ కి నివాసంగా పరిగణిస్తారట.
వాస్తు నియమాలు..
వాస్తు శాస్త్రం ప్రకారం గణేశుడి వీపు ఎప్పుడూ ఇంటి లోపలి వైపు ఉండకూడదట. ప్రధాన ద్వారం బయట గణేశుడి విగ్రహాన్ని ఉంచితే ఆయన వీపు ఇంటి వైపు ఉంటే అది చాలా అశుభం. అలా చేయడం వల్ల ఇంట్లోకి పేదరికం వస్తుందని, ఆర్థిక ఇబ్బందులు వస్తాయని నమ్ముతారు. ఒక వేళ గణేశుడి విగ్రహాన్ని ఇంటి గుమ్మం దగ్గర ఉంచాలంటే దానికి కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి.
తలుపు వెలుపల ఒక విగ్రహాన్ని ఉంచినట్లయితే, తలుపు లోపలి భాగంలో అదే స్థలంలో గణేశుడి విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచాలట.
ఇంటి లోపల, ఆరుబయట విగ్రహాల వెనుకభాగాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండాలి. ఇది ఇంటి లోపల దేవత వీపు కనిపించకుండా నిరోధిస్తుందని చెబుతారు. ఇంటి లోపల ఆనందం, శ్రేయస్సు అలాగే ఉంటుందని చెబుతారు.
గణేశుడి దృష్టి ఎల్లప్పుడూ ఇంట్లోనే ఉండాలి, తద్వారా ఆయన ఆశీస్సులు కుటుంబ సభ్యులపై ఉంటాయి.
ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా ఇంటి లోపల తొండం ఎడమ వైపుకు వంగి ఉన్న గణేశ విగ్రహం ఎప్పుడూ శుభప్రదంగా పరిగణిస్తారు. ఎందుకంటే వినాయకుడు తన తొండాన్ని ఎడమ వైపు ఉంచినప్పుడు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటాడట.
ఇంటి గుమ్మం దగ్గర విగ్రహాన్ని ఎక్కడ ఉంచినా.. ఆ ప్రదేశం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఆ ప్రాంతంలో చెప్పులు విడవడం లేదా బూట్లు విడవడం. చెత్త వేయడం వంటివి చేయకూడదు.
*రూపశ్రీ.