Read more!

ప్రాతఃస్మరణస్తోత్రమ్ అర్థాలతో

 

ప్రాతఃస్మరణస్తోత్రమ్ అర్థాలతో

 

 

 

 

ప్రాతః స్మరామి హృది సంస్ఫురదాత్మతత్త్వం
సచ్చిత్సుఖం పరమాహంసగతిం తురీయమ్ |
యత్స్వప్న జాగార సుమప్తమవైతి నిత్యం
తద్ బ్రహ్మ నిష్కలమాహం న చభూతసంఘ |1|
సచ్చిదానందరూపము, మహా యోగులకు శరణ్యము, మోక్షమునిచ్చునదీ అగు ప్రకాశవంతమైన ఆత్మాతత్త్వమునుపాత్రః కాలమునందు నా మదిలో స్మరించుచున్నాను. ఏ బ్రహ్మస్వరూపము స్వప్నము, జాగరణ, సుషుప్తి అనువాటితిని తెలుసుకొనుచున్నదో, నిత్యమూ, భేదము లేనిదీ అగు ఆ బ్రహ్మనేనే. నేను పంచబూతముల సముదాయము కాదు.

 

 

 

 


ప్రాతర్భజామి చ మనోవచసామగమ్యం
వాచోవిభాన్తి యదనుగ్రహిణ |
యంనేతినేతి వచనై నిగమా అవోచు
స్తం దేవదేవమజమచ్యుతమహురగ్ర్యమ్ |2|
మనస్సుకు, మాటలకు అందని ఆ పరబ్రహ్మను ప్రాతఃకాలమునందు సేవించుచున్నాను. ఆయన అనుగ్రహము వల్లనే సమస్త వాక్కులు వెలుగొందుచున్నవి. వేదములు 'నేతి'' "నేతి'' (ఇదికాదు, ఇది కాదు) అణు వచనములచే ఏ దేవుని గురించి చెప్పచున్నవో, జనన మరణములు లేని ఆ దేవ దేవునే అన్నిటికంటే గోప్పగాడుగా పండితులు చెప్పిరి.

 

 

 

 


ప్రాతర్భజామి తామస పరమర్కవర్ణం
పూర్ణం సనతనపదం పురుషోత్తమాఖ్యమ్ |
యస్మిన్నిదం జగదీషమశేషమూర్తౌ
రజ్జ్వాం భుజజ్గమ ఇవ ప్రతిభాసితం వై |3|
అజ్ఞానంధకారము కంటే వేరుగా సూర్యుని వలే ప్రకాశించు పూర్ణస్వరూపుడు, సనాతనుడు, అగు పురుషోత్తముని ప్రాతఃకాలము నాడు నమస్కరించుచున్నాను. అనంతస్వరూపుడగు ఆయన యందే ఈ జగత్తంతయూ తాడులో సర్పము వేలే కనబడుచున్నది.

 

 

 

 


శ్లోకత్రయమిదం పుణ్యం లోకోత్రయవిభూషణమ్ |
ప్రాతఃకాలే పరేద్యస్తు సగచ్చేత్పరమం పదమ్ |4|

మూడులోకములను అలంకరించునవి, పుణ్యకరములు అగు ఈ శ్లోకములను ఎవడైతే ప్రాతఃకాలము నందు పఠించునో వాడు మోక్షమును పొందును.