Read more!

రథసప్తమి పూజ ఎలా చేయాలి.. ఎందుకు చేయాలి..

 

రథసప్తమి పూజ ఎలా చేయాలి? ఎందుకు చేయాలి?

 

కంటికి కనిపించే దైవం సూర్య భగవానుడు. అందుకే ఆయన్ను ’ప్రత్యక్ష నారాయణుడు‘ అంటాం. ‘రథ సప్తమి’  సూర్యుని పండుగ. ఆదిత్యుని పుట్టిన రోజుగా రథ సప్తమి జరుపుకోవడం ఆనవాయితీ. సరిగ్గా ఆ రోజు నుంచే సూర్య గమనంలో మార్పు కూడా సంభవించడం విశేషం. ఆ రోజు సూర్యభగవానుడ్ని పూజిస్తే.. అష్టైశ్వర్యాలూ సిద్ధాస్తాయ్. సూర్యోదయ సమయంలో ఆ భగవానునికి అభిముఖంగా నిలబడి... జిల్లేడు ఆకులు, రేగి పళ్లు తల, భుజ స్థానాలలో ఉంచుకొని నమస్కరిస్తూ స్నానం చేయాలి.

తర్వాత సంక్రాంతికి పెట్టిన గొబ్బిళ్లతో చేసిన పిడకలతో తులసి కోట ఎదురుగా... పోయ్యిని ఏర్పాటు చేసుకొని... ఆవు పాలతో పరవాణ్ణం వండి.. దాన్ని చిక్కుడు ఆకుల్లో వడ్డించి సూర్య భగవానునికి నైవేద్యం అర్పించాలి. ఇంకా రధ సప్తమి నాడు చేయాల్సిన విధివిధానాలు  మరిన్ని తెలుసుకోవాలంటే.. ఇక్కుడున్న లింక్ ని ఓ సారి క్లిక్ అనిపించండి!   https://www.youtube.com/watch?v=fZcO65X69Cw