Read more!

మేషరాశి

 

స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సర
సూర్య సిద్ధాన్త పంచాంగం 2021 - 2022

మేషరాశిః - (చు, చె, చో, ల, లీ, లు, లే, లో, ఆ)
ఈ అక్షరములు కల ఈ రాశివార్కి ఆదాయం 8, వ్యయం 14 పూజ్యం 4 అవమానము 3. అభిమానవంతులు, తీవ్ర కోపం, ఆలోచన తక్కువ. చేయుపనులందు ఆలస్యమును సహించరు. ఇతరులకు లొంగియుండరు.  ప్రక్కవాళ్ళ విషయం చిన్న తనమున అనేక కష్టములు పడి పైకి వచ్చుదురు. ప్రక్కవాళ్ళ విషయం పట్టించుకోరు. పొగడ్తలకు లొంగగలరు. కోరికలు ఎక్కువ కాని నెరవేరుట తక్కువ. చిన్న తనమున అనేక కష్టములు పడి పైకి వచ్చుదురు. ప్రతి విషయంలోను నిదానం తక్కువ. ముక్కు సూటిగా పోవటం నిజాయితీగా బ్రతకాలి అనే మనస్తత్వము కల్గి ఉందురు. తొందరపాటు పనులు, అవసరమైతే అబద్ధమాడుటకు సందేహించరు. ధైర్య సాహసములు కలవారు నిర్మొహమాటంగా మాట్లాడుట ఎవరికి భయపడకపోవుట అహంభావమదికము స్వతంత్ర అభిప్రాయములు, సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానము అలవరచుకొనినచో జీవితమున అపజయములు కలుగవు.

ఈ రాఖి వార్కి 11లో గురువు 10లో శని 2లో రాహు 8లో కేతువు సంచరము చేత చేయు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహర రంగాల వార్కి శుభ సూచనలధికముగా నుండును సంఘమున గౌరవాభివృద్ధియు తేజస్సును. సర్వకార్యముల యందు సహయ సహకారములు శరీర బలము ప్రజలలో మాట పలుకుబడితనము కుటుంబ వ్యవహరముల యందు ఆర్థిక వ్యవహరములమందు జాగ్రత్తగా మెలగవలయును. ప్రతి పనియందు శ్రమ యధికము గృహమున శుభకార్యాచరణము సంతానము ద్వారా అభివృద్ధియు కోర్టు వ్యవహారముల యందు సానుకూలతయు జాయింటు వ్యాపారములు కల్సి వచ్చుట యున్నను స్వంత నిర్ణయాలతో ముందుకు వెళ్లిన మేలు కలుగును. ఆకస్మిక ఆదాయము లుండును. స్థిరాస్థి వ్యవహరములయందు జాగ్రత్త యువసరము. క్రయవిక్రయముల యందు మెలకువ అవసరము. మానసిక చింతన యుండును. వ్యవసాయదారులు నూతన పంటలు వేసిన లాభములుండును. ఫైనాన్స్ బ్రోకరు్ల, కాంట్రాక్టు రంగముల వారు నూతన మార్గముల ద్వారా ఆదాయము గడించుదురు. వస్ర్త, కిరాణ, ఫ్యాన్సీ వ్యాపారులకు ఆదాయుండదు. ఇంజనీర్లు, డాక్టరు్ల లాయర్లకు అవకాశములు తక్కువ రాజకీయ రంగాల వార్కి సంఘమున గౌరవాభివృద్ధియు నూతన ఆభరణముల కొనుగోలు బంధుమిత్రులతో విరోధము లేకుండా జాగ్రత్త వహించవలయును. సోమరితనము తొలగించుకొనవలయును నూతన గృహనిర్మాణము సమయాన్కి ధనం చేతికందుటయు సహనం అవసరము పుణ్యతీర్థ సందర్శనము. తీర్థయాత్రా ఫలప్రాప్తియు మధుర పదార్థ భక్షణము. విదేశ సంచారము. శుభవార్తలు వినుట జీవిత భాగస్వామి వలన ధనలాభము సంతోషమధికంగా నుండును. ఈ రాశివారు ప్రతినిత్యము శ్రీ విష్ణు కవచము పఠించిన అధిక శుభ ఫలములు కలుగును. ఈ రాశి వార్కి మంగళ, గురు, శుక్రవారములు అనుకూలంగా ఉండును. 9,18,27 తేదీలు అనుకూలము. 12,15,21,24,29,30 తేదీలు మధ్యమము. అశ్విని నక్షత్రము వారు వైడూర్యము భరణీ వారు వజ్రమును కృత్తిక వారు కెంపును ధరించి శుభ ఫలములు పొందగలరు.

 

తి.న.చ. సంపత్కుమార కృష్ణమాచార్య సిద్ధాన్తి