Read more!

వృషభరాశి

 

స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సర
సూర్య సిద్ధాన్త పంచాంగం 2021 - 2022

వృషభరాశిః - (ఈ,ఉ,ఏ,ఓ,వా,వీ,వు,వే,వో)
ఈ అక్షరములు కల ఈ రాశివార్కి ఆదాయం 2, వ్యయం 8, పూజ్యం 7, అవమానము 3. ఈ రాశివారి స్ర్తీ పురుష లక్షణములుః- స్థిరమైన ఆలోచనలు కల్గియుందురు. సంఘములో పరిచయములు అధికము మంచి ఆలోచనాపరులు ఏదైనా అవమానము జరిగితే మనస్సులో పెట్టుకొని సమయం వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకోవటం వీరి లక్షణము. ఆత్మస్థైర్యం ఎక్కువ అచంచలమగు నిశ్చయత్వము దయా దాన గుణము క్షమాగుణము మంచి వస్ర్తములు శుచియైన ఆహారము గ్రహించుటయందు అభిరుచి స్థిరత్వము. ఆనందము ధృడత్వము వాత్సల్యము విలాసవంతులు జీవితము సుఖముగా వుండును. సంపాదన బహువిధములుగా ఉండును. స్వలాభ బుద్ధి సమయము కాని పట్టుదల వలన కొన్ని నష్టములు కూడా వచ్చును.

ఈ రాశి వార్కి 10లో గురువు, 9లో శని, 1లో రాహువు, 7లో కేతువు సంచారము చేత చేయువృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహరముల యందు మిశ్రమ బంధు జనులను దూషించుటయు. మనోవిచారము పాపకర్మలందు ఆసక్తియు వివిధ రూపముల కష్టములు ప్రాప్తించుటయు అనుకున్న పనులు చెడిపోవుటయు చేయు వృత్తుల వార్కి ఆటంకములు కుటుంబము నందు కలహములు దేశ సంచారము, ధననష్టము, అనారోగ్యము, గృహమున శుభకార్యాచరణము సంతానము ద్వారా చిక్కులు, చికాకులు విదేశీ వ్యవహరములందు జాగ్రత్త అవసరము. ఆస్తి తగాదాలు శారీరక శ్రమయధికము. వ్యవసాయ రంగాల వార్కి పంటలు బాగా కల్సి వచ్చును. కిరాణా, వస్త్ర ఫ్యాన్సీ వ్యాపార రంగాల వార్కి ఆదాయము అధికముగా ఉండును. వ్యయము కూడా అధికమే. ఫైనాన్స్, బ్రోకర్లు, కంట్రాక్టర్లకు ఇతర ఆదాయ వనరులు ఏర్పడును. పురోహితులకు జ్యోతిష్కులకు, వాస్తుపండితులకు ధనదాయయుండును. న్యాయవాదులు, ఇంజనీర్లు, వైద్యులు విజయము పొందుదురు. రాజకీయ రంగాల వారికి ఉన్నతమైన వ్యక్తుల పరిచయము ఏర్పడి లాభములను ఆర్జించుదురు. సంతానము వల్ల కొన్ని ఇబ్బందులుండును. పట్టుదల అధికము. నూతన పనులు తలపెట్టుట, నూతన వస్తువులు, ఆభరణముల కొనుగోలు సంఘమున గౌరవము కాపాడుకొనవలయును. పరిచయము లేని వ్యక్తులను నమ్మరాదు. స్త్రీలకు సౌఖ్యము కులాచారముల యందు శ్రద్ధయు జీవిత భాగస్వామి వలన ధనలాభము బుద్ధిబలము ఆర్థికాభివృద్ధియు, ఆత్మీయుల సహకారము మొదలగు మిశ్రమ ఫలితములుండును. ఈ రాశి వారు ప్రతినిత్యము శ్రీ రామరక్షా స్తోత్రము ఆదిత్య హృదయము పఠించిన మేలు కలుగును. ఈ రాశి వారికి మంగళ, గురు, శుక్రవారములు 7,15,24, తేదీలు శుభదాయకము. 3,9,12,18,21,27,30 తేదీలు అనుకూలముగా నుండును. కృత్తిక వారు కెంపును, రోహిణి వారు ముత్యమును, మృగశిర వారు పగడమును ధరించి శుభ ఫలితములు పొందగలరు.

 

తి.న.చ. సంపత్కుమార కృష్ణమాచార్య సిద్ధాన్తి