Read more!

మీనరాశి

 

స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సర
సూర్య సిద్ధాన్త పంచాంగం 2021 - 2022

మీనరాశిః- (ది, దు, శం, ఝ, ధ, దే, దో, చా, చి)


ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, పూజ్యం 2, అవమానము 4. ఈ రాశి స్త్రీ, పురుష గుణములుః- ఎంతో ఔదార్యవంతులు, వేదాంత పరమైన ఆలోచనలు ఎక్కువ. ఆత్మస్థెర్యం చొరవ తక్కువ. ఏ విషయములలోను ముందుకు దూసుకుపోలేరు. నిజాయితీ ఎక్కువ. స్నేహితులను చూసి సంతోషిస్తారు. ప్రపంచములో ఏం జరిగినా పట్టించుకోరు. ప్రశాంతమైన జీవితము గడపడమంటే ఇష్టము. ఎవరియందు ద్వేషముగాని, కోపమురాదు. వచ్చిననను తగ్గదు. స్నేహితులకు, బంధువులకు సహాయము చేస్తారు. మనస్సు న్యాయబద్ధము, ధర్మమార్గము, దయాస్వభావము, వృద్ధి సంకలప్పము కల్గియుండును. సుకుమారమైన స్వభావము, సున్నితమైన ప్రవర్తన, ఇతరుల మనస్సును కష్టపెట్టకుండా క్రమశిక్షణ, బంధుమిత్రుల సహాకారము, సంపద, సంస్కారముతో వశపరచుకోగలుగుతారు.

ఈ రాశి వారికి 12లో గురువు, 11లో శని, 3లో రాహువు, 9లో కేతువు సంచారము చేత చేయువృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహరములయందు మిశ్రమ ఫలితములుండును. ఆరోగ్యము, ధనలాభము, సుఖజీవనము, కుటుంబము నందు సౌఖ్యము, సంతోషము. ప్రయత్న కార్యముల యందు జయము, ఉద్యోగస్థులకు ప్రమోషన్లు, ధర్మకార్యాచరణము, మనోల్లాసము మధుర పదార్థ భక్షణము. గృహమున శుభకార్యాచరణము. పుణ్యతీర్థ సందర్శనము, తీర్థయాత్రా ఫలప్రాప్తియు,యజ్ఞ యాగాది క్రతువులను జరుపుట, రాజకీయ వ్యవహారముల యందు జయము. శుభకార్యములు చేయుట వలన ధనర్వయము, పశునష్టము, స్థానచలనము, తరచు ప్రయాణములు, దరిద్ర బాధలు, అపకీర్తియు, మనస్తాపమును సహోదరులతో కలహములును వివిధ రూపముల కష్టములు ప్రాప్తించుటయు, నూతన పనులు తలపరాదు. పుణ్యక్షేత్ర సందర్శనము క్రయవిక్రయముల యందు జాగ్రత్తగా మెలగవలయును. ఫైనాన్స్, కాంట్రాక్టర్లు, బ్రోకర్లు రంగాల వారు జాగ్రత్త వహించిన లాభము కలుగును. ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపారముల వారికి ఆదాయమధికము. ప్రత్తి, మద్యం వ్యాపారులకు అధికారుల వేధింపులుండును. వైద్య, న్యాయవాద ఇంజనీరింగ్ రంగాల వారు సంతోషముతో నుందురు. నూతన గృహ నిర్మాణము, నూతన వ్యక్తుల పరిచయములు, భోజన సౌఖ్యము, సుగంధ లాభములు అనుకూలంగా ఉండును. మధ్యవర్థిత్వము పనికిరాదు. విదేశ సంచారము దేహసౌఖ్యము విధ్వాంసులతో పరిచయము కూలాచారము లందు శ్రద్ధయు, బంధుమిత్ర సమాగమము, మనోధైర్యము పరోపకార్యములు చేయుట భోగభాగ్యములు హృదయానందము స్త్రీ సౌఖ్యము కల్గి సౌఖ్యదాయకముగ నుండును. ఈ రాశి వారు ప్రతిరోజు దశావతారస్తోత్రము, శ్రీ రామరక్షా స్తోత్రము పఠించిన శుభములు కలుగును. ’ రాశి వారికి ఆది, సోమ, మంగళ, గురు, శనివారములు 5, 9, 14, 23, 27 తేదీలు యోగములు పూర్వాభాద్ర వారు పుష్యరాగము ఉత్తరాభాద్ర వారు నీలమణిని రేవతి వారు పచ్చను ధరించిన శుభములు కలుగును.

తి.న.చ. సంపత్కుమార కృష్ణమాచార్య సిద్ధాన్తి