పరశురామ జయంతి ఎప్పుడు...ఈరోజు ఎంత మంచిదంటే..!
పరశురామ జయంతి ఎప్పుడు...ఈరోజు ఎంత మంచిదంటే..!
ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ తిథి నాడు పరశురాముని జన్మదినోత్సవం జరుపుకుంటారు. పరశురాముడు శ్రీమహావిష్ణువు ఆరవ అవతారం అని చెబుతారు. ఈ సంవత్సరం పరశురామ జయంతి 29వ తేదీన వచ్చింది. పంచాంగం ప్రకారం, తృతీయ తిథి ఏప్రిల్ 29న సాయంత్రం 5:36 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 30న మధ్యాహ్నం 02:17 గంటలకు ముగుస్తుంది. పరశురాముడు ప్రదోష కాలంలో అవతరించాడు కాబట్టి పరశురాముడి జన్మదినోత్సవం ఏప్రిల్ 29న ప్రదోష కాలంలో జరుపుకుంటారట.
పరశురాముడి నుండి నేర్చుకోవాల్సినవి..
పరశురాముడు ప్రపంచానికి ఐక్యత సూత్రాన్ని ఇచ్చాడు. ఆయన అన్ని కులాలు, సమాజాల మధ్య సామరస్య సందేశాన్ని ఇచ్చారు. భారతీయ పురాణాలలో ఎక్కువ కాలం జీవించిన పాత్ర పరశురాముుడు. సత్యయుగం ముగింపు నుండి కలియుగం ప్రారంభం వరకు ఆయన ప్రస్తావన ఉంది. పరశురాముని జన్మ సమయాన్ని సత్యయుగం, త్రేతాయుగాల పరివర్తన కాలంగా పరిగణిస్తారు.
భారతదేశ చరిత్రలో ఎవరికీ అంత దీర్ఘకాలం జీవించిన చరిత్ర లేదు. ఆయన ఎల్లప్పుడూ నిర్ణయాత్మక, నియంత్రణ శక్తిగా ఉండేవారు. దుష్టులను అణచివేయడం, సత్పురుషులను రక్షించడం పరశురాముడి వ్యక్తిత్వ లక్షణాలు.
పరశురాముడి జయంతి రోజులోని ప్రతి క్షణం, ప్రతి సెకను శుభ సమయంగా పరిగణించబడుతుంది. అక్షయ తృతీయ రోజున వివాహం లేదా మరే ఇతర శుభ కార్యాల కోసం ప్రత్యేక శుభ సమయం వెతకాల్సిన అవసరం లేదు.
*రూపశ్రీ.