జగన్నాథ ఆలయ గోపురంపై గద్దల గుంపు.. ఆలయ అధికారులు చెప్పిన నిజం ఇదే..!
జగన్నాథ ఆలయ గోపురంపై గద్దల గుంపు.. ఆలయ అధికారులు చెప్పిన నిజం ఇదే..!
పూరీ జగన్నాథ ఆలయ గోపురంపై గద్దలు ఎగురుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. భారత దేశంలో పూరీ క్షేత్రానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ క్షేత్రం చాలా రహస్యాలు, మరెన్నో విచిత్రాలకు నెలవు. అలాంటి క్షేత్రంలో ఆలయ గోపురంపై గద్దల గుంపు తిరుగుతున్న వీడియో ఇప్పుడు భారతదేశం అంతటా చర్చనీయాంశంగా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో వందలాది పక్షులు నీలచక్రం పై ప్రదక్షిణలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. దీని గురించి ఇప్పుడు చాలా రకాల నమ్మకాలు, శకునాలు, వివిధ గ్రంథాలలో పేర్కొన్న విషయాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో పూరీ ఆలయ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలయ గోపురం పై పక్షులు తిరగడం గురించి వారు ఒక నిజం చెప్పారు. అదేంటో తెలుసుకుంటే..
భవిష్య మాలికా..
భవిష్య మాలిక ఆనేది జగన్నాథుని మార్గదర్శకత్వంలో పంచశాకలు అని పిలువబడే ఐదుగురు ఒడిశా సాదువులు రాసిన ఒక ప్రవచనాత్మక గంథం. దీన్ని మొదట తాళపత్రాలపై రాశారు. ఇందులో భవిష్యత్తుకు సంబంధించి చాలా మర్మమైన సంఘటనలు ఉన్నాయి. కలియుగం ముగింపును, సత్య యుగం ప్రారంభాన్ని కూడా ఇందులో వివరించారు.
పక్షులు ప్రకృతి వైపరీత్యానికి సంకేతమా..
భవిష్య మాలిక గ్రంథం ప్రకారం ఆలయ ధ్వజ స్తంభం పై డేగ లాంటి పక్షులు పదే పదే కనిపించడం జరిగితే అది ప్రకృతి వైపరీత్యం లేదా యుద్దం వంటి సంక్షోభాలను సూచిస్తుందట. కొందరు ఆలయంపై గద్దలు తిరగడం అశుభం అని చెబుతుంటే మరికొందరు అది శుభం అంటున్నారు.
ఆలయ అధికారులు చెప్పిన నిజం..
ఆలయ గోపురం పై గద్దలు తిరగడం పట్ల ఆలయ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలయం పైన గ్రద్ద తిరగడం సహజమైన విషయం అని వారు పేర్కొన్నారు. నేటి కాలంలో ఇది చాలా సాధారణమైన విషయం అన్నట్టు వారు ప్రకటనలో తెలిపారు.
ఆలయ అధికారులు ప్రకటన చేసినా సరే.. ప్రజలు ఆలయ గోపురంపై గద్దలు తిరగడం ఏదో ప్రకృతి వైపరీత్యం లేదా సంక్షోభానికి సూచన అని అంటున్నారు. పూరి క్షేత్రంలో జగన్నాథుడు తన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి పూజలు అందుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే,
*రూపశ్రీ.