శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు తులసితో ఇలా చేస్తే.. కృష్ణుడి అనుగ్రహం తథ్యం..!
శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు తులసితో ఇలా చేస్తే.. కృష్ణుడి అనుగ్రహం తథ్యం..!
శ్రీకృష్ణుడి జన్మదినాన్ని జన్మాష్టమి లేదా కృష్ణాష్టమి అని అంటారు. ఈసారి జన్మాష్టమి ఆగస్టు 16న జరుపుకుంటారు. ఈ ప్రత్యేక సందర్భంగా శ్రీకృష్ణుడిని పూజిస్తారు. దేశం యావత్తు జన్మాష్టమి వేడుకలు చాలా వైభవంగా చేస్తారు. అయితే శ్రీకృష్ణ జన్మదినం అయిన కృష్ణాష్టమి రోజు తులసి ఆకులతో చేసే పరిహారాలు, స్వామికి చేసే ఉపచారాలు చాలా గొప్ప ఫలితాలు ఇస్తాయి. ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుడి అనుగ్రహం తథ్యం అని అంటారు. ఇందుకోసం తులసితో ఏం చేయాలో తెలుసుకుంటే..
వైవాహిక జీవితంలో సంతోషం కోసం..
వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే జన్మాష్టమి నాడు ఇంట్లో తులసి మొక్కను నాటడం చాలా మంచిది. అలాగే ప్రతిరోజూ తులసిని పూజించాలి. తులసి ప్రదక్షిణ చేయాలి. మత విశ్వాసం ప్రకారం ఈ పరిహారం చేయడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది, అంతేకాదు.. లక్ష్మీ దేవి ఇంట్లోకి వస్తుంది. వాస్తు ప్రకారం ఇంటికి తూర్పు దిశలో తులసిని నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
కృష్ణుడు సంతోషిస్తాడు..
జన్మాష్టమి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీకృష్ణుడిని పూజించి, వెన్న, చక్కెర మిఠాయి, పండ్లు మొదలైనవి సమర్పించాలి. అయితే నైవేద్యంలో తులసి ఆకులను తప్పకుండా సమర్పించాలి. నైవేద్యంలో తులసి ఆకులను చేరిస్తే.. శ్రీకృష్ణుడు చాలా సంతోషిస్తాడని , నైవేద్యాన్ని అంగీకరిస్తాడని చెబుతారు. దీని వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.
ప్రతికూల శక్తిని వదిలిపోతుంది..
జన్మాష్టమి రోజున తులసి దగ్గర ఆవు నెయ్యి దీపం వెలిగించి, జీవితంలో ఆనందం, శాంతి కలగాలని లక్ష్మీ దేవిని ప్రార్థించాలి. ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీ దేవి ఇంట్లోకి వస్తుంది. అలాగే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి నశిస్తుంది.
*రూపశ్రీ.