విద్యతోనే అన్నీ

 

 

 

విద్యతోనే అన్నీ

 

 

విద్యా నామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం

విద్యా భోగకరీ యశః సుఖకరీ విద్యా గురూణాం గురుః ।

విద్యా బంధుజనో విదేశ గమనే విద్యా పరా దేవతా

విద్యా రాజసు పూజ్యతే న హి ధనం విద్యా విహీనః పశుః ॥

విద్య మనిషి తేజస్సుని ఇనుమడింపచేస్తుంది. అది ఎవ్వరి కంటా పడని రహస్య నిధితో సమానం. విద్య భోగాలను, సుఖాలను, కీర్తినీ కలిగిస్తుంది. అందుకనే విద్య గురువులకే గురువుగా నిలుస్తోంది. విద్యావంతుడు ఏ దేశమేగినా, అతనికి సాయపడే బంధువుగా అతనిలోని విద్య నిలుస్తుంది. అలాంటి విద్య కలిగినవాడిని రాజులు కూడా పూజిస్తారు. మరి జీవితానికి ఇంతగా ఉపయోగపడే విద్య లేనివాడు పశువుతోనే సమానం కదా!

 

..Nirjara