ఇవి ఉంటే చాలు

 

ఇవి ఉంటే చాలు

 

క్షాంతిశ్చేత్కవచేన కిం కిమరిభిః క్రోధోఽస్తి చేద్దేహినాం

జ్ఞాతిశ్చేదనలేన కిం యది సుహృద్దివ్యౌషధైః కిం ఫలమ్‌ ।

కిం సర్పైర్యది దుర్జనాః కిము ధనైర్విద్యాఽనవద్యా యది

వ్రీడా చేత్కిము భూషణైః సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్‌ ॥ (భర్తృహరి)

క్షమకలిగినవారికి వేరే కవచం అవసరం లేదు – ఓర్పే అతనికి కవచంగా భాసిస్తుంది.

క్రోధం ఉన్నవాడికి వేరే శత్రువులు ఉండనక్కర్లేదు – ఆ కోపమే అతడిని నాశనం చేస్తుంది.

జ్ఞాతులు (దాయాదులు) ఉన్నవారికి వేరే అగ్ని అవసరం లేదు – వారే అతని జీవితాన్ని దహింపచేస్తారు.

సహృదయులున్న వారికి ఔషధాలతో పనిలేదు – వారు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తారు.

దుర్జనలు ఉన్నచోట సర్పాలు అవసరం లేదు – కావల్సినంత విషం చిమ్మేందుకు వారు సిద్ధంగా ఉంటారు.

విద్య ఉండగా వేరే ధనం లేకున్నా ఫర్వాలేదు – విద్యకి మించిన ధనం ఏముంటుంది?

బిడియం ఉన్నవారికి వేరే ఆభరణం అవసరం లేదు – సిగ్గే అతనికి ఆభరణంగా భాసిస్తుంది.

సృజన కలిగినవాడికి వేరే రాజ్యం ఉండనవసరం లేదు – రాజులని మించిన యశస్సు అతనికి లభిస్తుంది.