నీచుడి దగ్గర సంపద ఉంటే!

 

 

 

నీచుడి దగ్గర సంపద ఉంటే!

 

 

 

నీచునకు ధనము గల్గిన

వాచాలత గల్గి పరుషవాక్కు లఱచుచున్

నీచ కృతి యగుచు మది

సంకోచము లేకుండఁదిరుగు గువ్వలచెన్నా!

 

సంపద గుణవంతుడికి శోభనిస్తుంది. కానీ అదే సంపద నీచుడికి కలిగితే అతని స్వభావం ఎలా ఉంటుందో మూడు వందల ఏళ్ల క్రితమే చెప్పుకొచ్చాడు గువ్వలచెన్నుడు అనే కవి. నీచుడికి ధనం కలిగితే అతని నోటికి అడ్డు ఉండదట. దురుసుమాటలు మాట్లాడుతూ ఉంటాడట. ఇక అతని మనసు కూడా ఎలాంటి సంకోచమూ లేకుండా ఏ పాపకార్యం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటుందట.

 

...Nirjara