దేనికైనా నీవే గతి
దేనికైనా నీవే గతి
పెంపునదల్లివై, కలుష బృందసమాగమ మొందకుండ ర
క్షింపను తండ్రివై మెయివసించు దశేంద్రియ రోగముల్ నివా
రింపను వెజ్జువై కృపగురించి పరంబు దిరంబుగాగ స
త్సంపదలీయ నీవెగతి దాశరథీ! కరుణాపయోనిధీ!
పోషించుటలో తల్లివి, పాపాల బారిన పడకుండా రక్షించడంలో తండ్రివి, దశేంద్రియాల కారణంగా వచ్చే రోగాలను తగ్గించే వైద్యునివి. దయ చూపేందుకైనా, మోక్షాన్ని అందించేందుకైనా, సత్సంపదలను అనుగ్రహించేందుకైనా నీవే గతి కదా దాశరథి.
..Nirjara