Read more!

గోమతి నది ద్వారక, గుజరాత్

 

 

గోమతి నది ద్వారక, గుజరాత్

 

 

 

గోమతి నది

మన పుణ్య  భారత దేశంలో ఎన్నో జీవ నదులు వేల మైళ్ళ కొద్దీ ప్రవహిస్తూ నదీ పరీవాహక ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తున్నాయి.

ప్రముఖ నది గంగా నది  ఉపనదే  గోమతి. ఈ గోమతి నది భారత దేశం లోని లక్నో వంటి ప్రముఖ పట్టణాల  గుండా  ప్రయాణించి చివరికి ద్వారక చేరి  అరబియా  సముద్రంలో కలుస్తోంది. లక్నో కి దగ్గరలోని నైమిశారణ్యం కూడా   గోమతి నదీ తీరానే  వుంది.  ద్వారకా  గోమతి నదికి ఎంతో  పవిత్రత  వుంది.
స్కంద పురాణం లో గోమతి నదీ మహత్యం వివరించబడింది.  
స్కంద పురాణం లోని రెండవ వైష్ణవ ఖండం లో 41 వ అధ్యాయంలో ప్రహ్లాదుడు  ద్వారకా మహత్యం గురించి వివరిస్తూ ప్రారంభం లోనే మొదటి శ్లోకంలో ఇలా అంటాడు...
                              घन्यास्तु नरलोकास्ते गोमत्यं तु कृतोदकाः ।
                              पूजयिष्यन्ति ये कृष्णं कतकी तुलसी दलौः ।।
    
   ఎవరైతే గోమతి నదిలో స్నాన మాచరించిన తరువాత శ్రీకృష్ణుడిని కేతకీ పుస్పాలతోను, తులసి దళాలతోను అర్చిస్తారో  వారు ధన్యులు అదృష్ట వంతులు అని వుంది  
అలాగే ఇంకో శ్లోకంలో
                             गोमतयं यः सकृत्सात्वा पष्येतु कृष्ण मुखांबुजमू।
                            सव निुदूरता पापादपि त्रौलक्यदाहकातू ।।

పవిత్రమైన గోమతి నదిలో స్నానమాచరించి మనసుని, శరీరాన్ని శుద్ధి చేసుకుని పవిత్రమైన మనసుతో ఆ కృష్ణుని  దర్సిస్తే  పాపాలన్నీ తొలగిపోతాయని వుంది 34 వ అధ్యాయంలో
ఇంకా చాలా చోట్ల గోమతి నదీ మహత్యాన్ని వివరించారు స్కంద పురాణంలో ...

            పురాణాల  కాలం నుంచి  ఈ నదికి ప్రాముఖ్యం  వుంది.  పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు  సతి రుక్మిణీ దేవితో  కలిసి   గురువైన దుర్వాస మహర్షిని    తమ ఇంటికి  భోజనానికి  ఆహ్వానిస్తాడు.  దూర్వాస ముని ఎక్కిన రధాన్ని శ్రీకృష్ణుడు, రుక్మిణీ దేవి  లాగుతుండగా కొద్ది దూరం వెళ్లేసరికి  రుక్మిణీ దేవి అలసిపోయింది. దాహం వేయసాగింది .  అందుకు శ్రీకృష్ణుని సాయం కోరగా, శ్రీకృష్ణుడు తన కాలి బొటన వేలితో భూమిని తవ్వాడు. భూమిలోనుంచి  గంగమ్మ పైకి వచ్చింది. రుక్మిణి దేవి ఆ నీటితో తన దాహాన్ని తీర్చుకుంది .  దూర్వాస మహార్చికి  చాలా తొందరగా  కోపం వస్తుంది.  శాపాలూ ఇస్తుంటాడు .  తనని సంప్రదించకుండా,  తనకి నీరు ఇవ్వకుండా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి కి నీరు ఇచ్చినందుకు  కోపం వచ్చింది  ఆ మహర్షికి.  రుక్మిణీ దేవిని శ్రికృష్ణుడిని విడిపోమ్మని శపించాడు.  సముద్రపు  ఒడ్డున వున్నా రుక్మిణీ దేవి   ఆలయం చుట్టుపక్కల  మైదానమే  కనిపిస్తుంది. అంతే కాదు  గోమతి నదికి చుట్టుపక్కల 40 కి.మి. వరకు మంచి నీరు లభించదని. అంతా ఉప్పు నీరే అవాలని  శపించాడు.  అందుకే  గోమతి నది నీరు ఇక్కడ తియ్యగా కాకుండా ఉప్పగా వుంటాయి.

మనకి  ద్వారక ఆలయంలో  శ్రీ కృష్ణ ఆలయం పక్కనే, అష్ట భార్యలు ఉన్న మందిరాలూ  వుంటాయి. కాని  వాటిల్లో  రుక్మిణీ దేవి మందిరం కనిపించదు.  రాధాకృష్ణుల మందిరం, మిగతా  దేవేరుల మందిరాలు ఒకే చోట  వున్నాయి. 

గోమతి సరస్సు గురించి  మరో కథ.  మహాభారతం  లోని  కథనం  ప్రకారం ఒకసారి భీముడు శ్రీకృష్ణునితో కలసి  ప్రయాణం చేస్తున్నపుడు  ఒక చిన్న మంచి నీటి కొలను తవ్వాడుట.  ఆ దారిగుండా  వచ్చిపోయే యాత్రికులకు, పశు పక్ష్యాదులకు దాహార్తిని తీర్చేదట. ఆ మంచి నీటి  కొలను 230 చ.అ విస్తీర్ణం కలిగి వుంది అక్కడ కొలను మధ్యలో డాకోడ్ ఆలయం వుంది. మూల  విరాట్టు  ద్వారకా దీసుడైన శ్రీ కృష్ణుడే. ఈ సరస్సుకు ద్వారక లోని గోమతి నది పేరు వుంది. 

ద్వారక లోని గోమతి నది అరేబియా సముద్రంలో కలుస్తుంది.  ఇక్కడే  అసలు ద్వారకా పట్టణం వుంది.  శ్రీ కృష్ణుడి నిర్యాణానంతరం ద్వారక  సముద్ర గర్భంలో మునిగిపోయింది. ఆ సముద్ర తీరంలోనే  ప్రస్తుత ద్వారకా ఆలయం  వుంది.

ఈగోమతీ  నదిలో లభించే  చక్రాంకితాలు ఎంతో పవిత్రమైనవి.ఈ చక్రాంకితాలు ద్వారక లోని గోమతి నదీ తీరం లోనే  లభ్యమవుతాయి. చంద్రుడు వృషభ  రాశి లోని రోహిణి నక్షత్రంలో కాని, తులా రాసిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో సోడియం  లేదా కార్బన్ అణువులతో ఇవి రూపుదిద్దుకుంటాయి.   యాత్రికులు సముద్ర స్నానాలు చెస్తారు.
గోమతి సంగం  ఘాట్ విశిష్ఠ మైనది. ఈ ఘాట్ నుంచి  ఘాట్ నుంచి 56 మెట్లు  పైకి ఎక్కితే ద్వారకా దీసుని ఆలయ  స్వర్గ  ద్వారం వస్తుంది.

 

 

 

 

1. గోమతి ఘాట్ నుంచి  శ్రీకృష్ణ ఆలయానికి మెట్లు        2.  శ్రీ వసిష్ఠ మహర్షి, గోమాతిదేవి, లక్ష్మిదేవిల ఆలయాలు

ఈ సంగమ  ఘాట్ నే చక్రతీర్ధ ఘాట్ అని కూడా అంటారు. ఇక్కడే గోమతి నది సముద్రంలో కలుస్తుంది.  సముద్రంలో కలిసే చోట  సముద్ర నారాయణుని  ఆలయం  వుంది. సముద్ర నారాయణుని  ఆలయం  ఇక్కడ ఒక చోటే వుంది.
గోమతి ద్వారక నదీ ప్రాంతం లోని నీరు  చాలా  క్లియర్ గా, స్వచ్చంగా వుంటాయి.     నీరు  శుభ్రంగా వుంది  లోపల వున్న ఇసుక స్పష్టంగా కనిపిస్తుంది .

 

 

1. ఇసుకే కాదు  గోమతి నది ఈ ఇసుక మీదే  వుంది.  నీళ్ళు  కనిపించటం లేదు కదూ .  ఇలాటి నీటిలో  మేము  చాలా  దూరం నడిచాము

ఇక్కడ సముద్రపు అలలు ఒకసారి ఉధృతంగా, మరోసారి అలలు లోపలి వెళ్లి ఖాళీగా వున్న నది కనిపిస్తుంది.

మేము వెళ్ళినపుడు గోమతి నదిలో నీరు అసలు లేదు.

 

 

 

 

 

 

1. ఒకే చోట  గోమతి  ఘాట్ నీతితో నిండిన ఘాట్ .....      2.  నీరు లేని గోమతి ఘాట్    3. పక్కనే అలలతో  ఎగిసిపడే గోమతి సాగర్ ల సంగం ఘాట్

లోపలి దాకా నడిచాము. కొద్దిగా నీరు పారుతుండేది.  అదే  ఆ రోజు  సాయంకాలానికి నీరు  గట్టు మీద మెట్ల వరకు  వచ్చింది. మూడో రోజు  4 మెట్ల వరకు  నీరు  వచ్చింది.  ఇక సంగం  ఘాట్ లో సముద్రుడు నదిలో కలిసి ఎత్తైన అలలు ఎగిసి పడుతూ మెట్టు పైన నిలబడ లేక పోయాం .  అలల ఉధృతికి జారి పడిపోయే వాళ్ళం .  చూస్తుండ గానే  ఒక వ్యక్తీ అలలపై తేలియాడుతూ సముద్ర గర్భం లో కలిసి పోయాడు.  అతి ప్రమాదకరమైన ఘాట్ ఇది. అక్కడికీ  చుట్టు పక్కల  వాళ్ళు  హెచ్చరిస్తూనే వుంటారు.  మెట్లు దిగద్దని.  మేము ద్వారకలో  వారం రోజులు ఉన్నాము.  ప్రతి రోజు  గోమతీ నదీ స్నానం చేసేవాళ్ళం.
మంచి నీటి నదీమ తల్లి అయిన గోమతి నది నీరు మాత్రం  ద్వారకా పట్టణం  చుట్టు పక్కల నలభై కిలో మీటర్ల వరకు నీరు ఉప్పగా వుంటుంది.  అందుకు ఆ గోమతీ  నదికి వున్న శాపమే  కారణం అని అంటారు.  కొన్ని చోట్ల మంచినీటి  బావులు వున్నాయి .

గోమతి నదికి ఆవలి ఒడ్డున పంచ పాండవుల బావులు వున్నాయి.  యాత్రికులు చిన్న చిన్న బోటుల ద్వారా అక్కడికి చేరుకుంటారు.  పాండవులు తమ రాజ్యాన్ని, భార్య ద్రౌపదిని, తమ సర్వ స్వాన్ని కోల్పోయిన వారు   తరువాత ఇక్కడికి  వచ్చినపుడు తమ  తపస్సు శక్తితో ఆ బావులు  పాండవులు తవ్వారని, అప్పుడు వచ్చిన వాటిలోని నీటి   రుచి ఒక్కో బావిలో ఒక్కో రుచి వుందిట.   ఆ పంచ బావులు 5 నదులకి  ప్రతీకలు. ధర్మ రాజు బావిలోని నీరు లక్ష్మణ నీరు అనీ,  భీమ కుండ్ లో జాంబవతి నది, అర్జునుడి కుండ్ లో గోమతి, నకులుడు ఉషావతి నది, సహదేవ్ కుండ్ లో చంద్రభాగ నది అని ,  పిల్లుస్తారు

 

 

 

1. ​గోమతి నది ఒడ్డున వున్నా దూర్వస కుండ్, మరియు   2.  కృష్ణమందిర్

భారతీయ సంస్కృతిలో పవిత్రమైన ఈ గోమతి నది ప్రాశస్త్యం తెలిసిన వారు, తెలియని వారూ ఈ ద్వారకా నగరం చేరుకొని, ఈ గోమతి నదిలో పుణ్య స్నానాలు చేసి, ఆ కృష్ణ పరమాత్మని దర్సిమ్చుకోవటం అనాదిగా  వస్తున్నది.
ద్వారకా పట్టణంలో గోమతీ ఘాట్ ల వద్ద  వరుసగా అనేక  ఆలయాలు  వున్నాయి. సంగమ ఘాట్ వడ్డున శివాలయం, రాముడు, సీత, లక్ష్మణుల ఆలయాలు, సుధాముని ఆలయం వున్నాయి. దూర్వాస కుండ్, ఇంకా ఎన్నో ఉప ఆలయాలు  వున్నాయి.

ఇక నదీ ఒడ్డున యాత్రికులని  ఆకర్షించే ఎన్నో వస్తువుల దుకాణాలు  వున్నాయి.  ముఖ్యంగా  గోమతి, సముద్రంలో లభించే చక్రాంకితాలు, ముత్యాలు, శంఖాలు, ఇతర రంగు రంగుల రాళ్ళు అతి చౌకగా లభిస్తాయి.  చక్రాంకితాలు ఒకటి  5 రూపాయలు, ముత్యాలు ఒకటి 5 రూపాయలు ఇలా వుంటాయి వాటి ధరలు.  ఇవే కాదు ఎన్నో వస్తువులు, శ్రీకృష్ణుని విగ్రహాలు లభిస్తాయి. ముఖ్యంగా  పారాడే  కృష్ణుడు ఇక్కడ చాలా ఫేమస్.  

నదీ తీరం చుట్టూ అందమైన విహార ఘాట్లు నిర్మించారు.  శ్రీకృష్ణుడి లీలలు ప్రదర్సించే చిత్రాలు (పెయింటింగ్స్) వరుసగా వున్నాయి.  అలసిన వారికి సేద తీరేలా రాతి బెంచీలు, సుందర స్తూపాలు, నిర్మించారు.  గోమతి నది ఆవలి వొడ్డు చేరటానికి ఓవర్ బ్రిడ్జి ని నిర్మిస్తున్నారు. అది ఇంకా ప్రారంభం కాలేదు. తుది దశలో వుంది.  
        

...Mani