అసాధ్యాన్ని సాధ్యం చేసే గాయత్రి మంత్ర సాధన.. చాలామందికి తెలియని రహస్యాలు!

 

అసాధ్యాన్ని సాధ్యం చేసే గాయత్రి మంత్ర సాధన.. చాలామందికి తెలియని రహస్యాలు!

హిందూ ధర్మంలోని ప్రసిద్ధ మంత్రాలలో గాయత్రి  మంత్రం ఒకటి. ఇది గాయత్రి ఛందస్సులో రాయబడింది. వేద అధ్యయనంలో గాయత్రి మంత్రానికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఆధ్యాత్మిక సాధన,  ధ్యానం కోసం గాయత్రి మంత్రాన్ని జపించమని చెబుతారు. గాయత్రి మంత్ర జపం ధ్యానాన్ని,  జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుంది.  ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి శుద్ది కావడానికి కూడా గాయత్రి మంత్ర సాధన ఉపయోగపడుతుంది.  అసాధ్యం అనుకున్న పనులు కూడా గాయత్రి మంత్రం సాధన చేస్తే సాధ్యం అవుతాయని చెబుతారు.  గాయత్రి మంత్రం అర్థం,  గాయత్రి మంత్ర సాధన,  గాయత్రి మంత్రం గురించి చాలా మందికి తెలియని నిజాల గురించి తెలుసుకుంటే..

గాయత్రి మంత్రం..


"ఓం భూర్భువః స్వః, తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్"

అర్థం..

ఓం  : అనంతాన్ని లేదా బ్రహ్మాన్ని సూచించే అక్షరం. దీన్నే ప్రణవం అని అంటారు. ప్రణవమే పరమాత్మ.

భూర్బువః స్వః.. :  భూలోకం,  స్వర్గం,  పాతాళం అనే మూడు లోకాలను సూచిస్తుంది.

తత్సవితుర్వరేణ్యం..: తత్ అంటే బ్రహ్మను సూచించే మరొక పేరు,  అలాగే వరేణ్యం అంటే పూజనీయమైన లేదా ఆరాధించదగిన అని అర్థం.  బ్రహ్మ ఆరాధన లేదా పరమాత్ముని ఆరాధనను సూచిస్తుంది.

భర్గో.. :  బ్రహ్మకు లేదా పరమాత్మకు ఉన్న కాంతిని లేదా తేజస్సును సూచిస్తుంది.

దేవస్య ధీమహి..: బ్రహ్మను లేదా పరమాత్మను స్మరించుకుని ఆయనను పూజించడాన్ని సూచిస్తుంది.

ధియో యో నః ప్రచోదయాత్..:  సత్యం, ధర్మం మార్గాన్ని చూపించగలిగే జ్ఞానం, వివేకం, అవగాహనను ప్రసాదించమని ప్రార్థించడాన్ని సూచిస్తుంది.

మంత్రం పూర్తీ అర్థం..

గాయత్రి మంత్రంలో బ్రహ్మను పూజిస్తాము.  జ్ఞానం, వివేకం,  అవగాహనను ఇవ్వమని బ్రహ్మ దేవుడిని లేదా పరమాత్మను శరణు వేడతాము. దీని ద్వారా శరీరం, మనస్సు, ఆత్మ ఒకటై.. సత్యం,  ధర్మ మార్గాన్ని అనుసరించడానికి సాధ్యమవుతుంది.  గాయత్రీ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల ఆధ్యాత్మిక సాధన చాలా మెరుగ్గా ఉంటుంది.  మానసిక శాంతి,  శ్రేయస్సు పొందడంలో ఉపయోగకరంగా ఉంటుంది.

గాయత్రి మంత్రం ప్రయోజనాలు..

గాయత్రి మంత్రం సాధన చేయడం వల్ల ధ్యాన శక్తి అభివృద్ది చెందుతుంది. దీని వల్ల  వ్యక్తి తన మనస్సును నియంత్రించుకోగలడు.

గాయత్రి మంత్ర జపం చేయడం వల్ల మేధస్సు అభివృద్ది చెందుతుంది.  ఆలోచనా సామర్థ్యం మెరుగుపడుతుంది.

గాయత్రి సాధన ద్వారా ఆత్మజ్ఞానం లభిస్తుంది.  వ్యక్తి తన ఆత్మను తాను అధ్యయనం చేసుకోగలడు.

శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా గాయత్రి సాధన ఉపయోగపడుతుంది.

గాయత్రి సాధన ద్వారా ఐశ్వర్యాన్ని,  బలాన్ని కూడా పొందుతారు.

గాయత్రీ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల వ్యక్తి ఆత్మవిశ్వాసం బలపరుడుతుంది.

హాయత్రీ సాధన చిత్తశుధ్దితో చేసే వారికి పై ప్రయోజనాలు అన్నీ లభిస్తాయి.  

ఎలా సాధన చేయాలి?

గాయత్రీ జపాన్ని బ్రహ్మ ముహూర్తంలో చేయడం మంచిది.  తులసి మాల లేదా రుద్రాక్ష మాలతో గాయత్రి జపాన్ని చేయవచ్చు.

జపం చేయడానికి ఆసనం వేసుకోవడం తప్పనిసరి. అది కూడా దర్బ ఆసనం చాలా శ్రేష్టం.

సాధన కోసం జపం చేసేవారు బ్రహ్మచర్యం పాటిస్తే మంచిది.  అలాగే నేల నిద్ర కూడా చాలా శ్రేష్టం. ఇందుకోసం చాప లేదా కంబళి పరుచుకుని పడుకోవచ్చు.

గాయత్రి సాధన చేసేవారు దేనికీ వ్యసనంగా ఉండకూడదు. పోన్,  ఆహార పదార్థాలు,  పానీయాలు మాత్రమే కాకుండా మనుషులకు కూడా వ్యసనంగా ఉండకూడదు.

జపంలో నూరవ వంతును హవనంగా చేయాలి.  అలాగే పూర్ణాహుతి తర్వాత ప్రసాద వితరణ,  బ్రహ్మచారులకు, చిన్న వయసు పిలిచి భోజనం పెట్టడం మొదలైనవి సామర్థ్యానికి తగ్గట్టుగా చేయాలి.

                         *రూపశ్రీ.