దైవం - మనుష్య రూపం

 

దైవం - మనుష్య రూపం

 

"శ్రీరుక్మిణీశ కేశవ

నారద సంకీతలోల నగధర శౌరీ

ద్వారక నిలయ జనార్ధన

కారుణ్యము తోడ మమ్ము గాపుము కృష్ణా!"

 శ్రీకృష్ణా! నువ్వు రుక్మిణీ దేవికి భర్తవు. సర్వేశ్వరుడవు. నారద మహర్షి చేసే రాగ సుధా గానామృతంలో ఆసక్తి ఉన్నవాడివి. గోవర్థన గిరిని ఎత్తినవాడివి. ద్వారకానగరంలో నివసించినవాడవు.రాక్షసులను చంపినవాడవు. ఇన్ని విధాలుగా గణ సుగుణాలు కలిగిన గొప్పవాడివయిన నీవు మావంటి మానవులను దయతో రక్ష్మించుము.

ఇలా సర్వ కాల సమయాలలో మనుషులు భగవంతున్ని రక్షించమని ప్రార్ధిస్తారు. మనుషులే కాదు ఈ భూమండలం పై సంచరించే సకల చరాచర జీవరాశి స్మరించేది ఆ శ్రీమన్నారాయునుడినే! ఇక్కడే మనం ఒకటి పట్టుకోవాలి.

ఎవరైనా సహాయం కోరి వస్తే అనాలోచితంగా తిరస్కరించక ఒక్క క్షణం ఆలోచిస్తే జ్ఞానం బోధపడుతుంది. అందరికీ ఆ కేశవుడే కదా రక్షకుడు. అటువంటిది, మన సహాయం కొరకు వచ్చాడంటే అది దైవ కార్యంగా భావించాలి. సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువు స్థానంలో మనం నిల్చున్నట్లు లెక్క. సహాయం చేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతంగా మనం భావించాలి.

మీకు ఇంకా వివరంగా అర్ధమయ్యేలా చెప్పాలంటే!
ప్రభుత్వ అధికారి సెలవు తీసుకొని వెలితే, ఆయన కింద అధికారి (Aditional officer) ఆ భాద్యతలు నిర్వర్తిస్తారు. ఇది కూడా అంతే! ఆయన పరీక్షించడానికి శరణార్థిని మన వద్దకు పంపారో లేక లక్ష్మీ నయనారవిందాలలో లీనమై ఉన్నారో తెలీదు. సాక్షాత్తు దైవ కార్యం నిర్వర్తించమని మనకి అప్పగించినట్లే అర్ధం చేసుకోవాలి. అందుకే "మానవ సేవే మాధవ సేవ" అన్నారు. 

సహాయం చేసే అవకాశం అందరికీ రాదు. వస్తే కాదనక సాధ్యమైన సహాయం చేసి దైవకార్యం నిర్వర్తించు. తకిమా జగన్నాటకం పైవాడే చూసుకుంటాడు.

- వెంకటేష్ పువ్వాడ