గర్భిణులు.. ఆస్తమా సమస్యలు
గర్భిణులు.. ఆస్తమా సమస్యలు
స్త్రీలు గర్భిణిగా ఉన్నప్పుడు అస్తమా సమస్య వస్తే లక్షణాలు దృష్టిలో పెట్టుకోవాలి.గర్భస్థ సమయంలో ఆస్తమాకు కారణాలు లక్షణాలు తెలుసుకోవడం అవసరం. గర్భస్థ సమయంలో మహిళలు గర్భం లోని శిశువు ఇద్దరి ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సమయం లో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా అటు బిడ్డ తల్లికి ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా గర్భస్థ సమయం లో మహిళలలో అస్తమా సమస్య ఎందుకు వస్తుంది. ఇది ఒక ఊపిరి తిత్తులకు సంబందించిన సమస్య ఈ కారణం గా నే గుండెల్లో నొప్పి,ఊపిరి తీసుకోవడం లో ఇబ్బంది పడడం.దగ్గు వంటి లక్షణాలు చూడ వచ్చు.ఈ సమయం లో ఈ సమస్య గురించి తెలుసుకోవడం అవసరం.ఈ వ్యాసం అస్తమా గర్భిణీలలో లక్షణాలు అందుకు గల కారణాలు ఎలా ఉంటాయి.దీని బారిన పడకుండా తీసుకోవాల్సిన రక్షణ చర్యలు చేపట్టాలో తెలుసుకుందాం.
గర్భిణిలో ఆస్తమాకు కారణాలు...
స్త్రీలు ఎప్పుడై తే గర్భ ధారణ చేస్తారో గర్భావస్తలో ఉంటారోఆసమయంలో ఈస్ట్రోజన్,ప్రోజేస్టరాన్ హార్మోన్లు చాలా ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అవుతుంది.ఈస్ట్రోజన్ వల్లే సైనస్ సమస్యలు ముక్కులు మూసుకు పోవడం వంటి సమస్యకు ఈస్ట్రోజన్ కారణం గా పేర్కొన్నారు వైద్యులు.ఊపిరి తీసుకోవాలంటే గర్భిణీలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.ఊపిరి తీసుకోలేక పోవడం లేదా ఊపిరి వదలడం కూడా ఒక్కోసారి ఇబ్బంది పెడుతుంది. ప్రోజేస్టాన్, ఈస్ట్రోజన్ హార్మోన్లు అధిక సంఖ్యలో ఉండడం వల్లే ఊపిరి తీసుకోవడం లో ఇబ్బంది పడుతున్నారని అందుకే గర్భస్థ సమయం లో గర్భిణీలు అస్తమా ను ఎదుర్కోవాల్సి వస్తుంది.
గర్భస్థ సమయం లో అస్తమా లక్షణాలు...
గర్భస్థ ఆస్తమా ఉన్న వారిలో కింద పేర్కొన్న లక్షణాలు ఉంటాయి.ఊపిరి తీసుకోవడం సమస్యగా ఉంటుంది. గుండెల్లో నొప్పి వచ్చినట్లుగా ఉంటుంది. త్వరగా అలిసి పోతారు. తీవ్రమైన తలనొప్పి .
జలుబు దగ్గు తో ఇబ్బంది పడతారు. ఈ లక్ష ణాలు కనిపించిన వెంటనే డాక్టర్ వద్దకు తీసుకు వెళ్ళాలి.
అస్తమా నుండి రక్షించుకోవడం ఎలా ?...
దుమ్ము,ధూళి కి దూరంగా ఉండాలి.పౌష్టిక ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఒక వేళా గతం లో మీకు శ్వాస సంభందిత సమస్యలు ఉంటె సమయానికి పరీక్షలు చేయించడం తప్పనిసరి. గర్భిణీలు ముఖ్యంగా పరుపెట్టడం,త్వరగా నడిచేందుకు ప్రయత్నం చేయడం చేయడం సరికాదు.లేదా సుదీర ప్రాంతలాకు బైక్ పైన బస్సుల్లో ప్రయాణం చేయకండి అలా చేస్త్ఘే ఏమాత్రం చిన్న దెబ్బ తగిలినా గర్భ స్రావం అవచ్చు. మీరు గర్భిణీగా ఉన్నప్పుడు మీరు డాక్టర్ సలహా లేకుండా మందులు వాడడం కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది.