దెయ్యంపై మనసుపడ్డ త్రిష
చెన్నై ముద్దుగుమ్మ త్రిష ఇప్పుడు చాలా సెలక్టివ్ గా మారిపోయింది. వరుణ్ మనియన్ తో పెళ్లి నిశ్చితార్ధమవగానే, తన సినిమాలన్నింటినీ వేగంగా పూర్తి చేసుకుని, కొత్త సినిమాలను కూడా తగ్గించుకుంది. కానీ, వారిద్దరి బంధానికి ఫుల్ స్టాప్ పడటంతో, తిరిగి కెరీర్ మీద దృష్టి పెట్టిందీ తమిళ భామ. ఒకప్పటిలా కాకపోయినా, త్రిషకు ఇప్పుడు కూడా బాగానే ఆఫర్లు వస్తున్నాయి.