Read more!

English | Telugu

రెజీనా డ్రస్ చిరిగిపోయిందట..

ఐఫా అవార్డ్స్ లో రెజీనా వేసిన డ్రస్ ను చూసిన వారెవరూ అంత తేలిగ్గా దాన్ని మర్చిపోరు. దాన్ని దోమల తెర అంటూ కామెంట్లు, చాలా బాగుందంటూ కాంప్లిమెంట్లు కూడా రెజీనాకు వచ్చాయి. కానీ ఆమెను మాత్రం ఆ డ్రస్ చాలా ఇబ్బంది పెట్టిందట. ఎంతో ఇష్టపడి డిజైనింగ్ చేయించుకున్న డ్రస్ అలా అవుతుందని అనుకోలేదంటూ వాపోయింది రెజీనా.

విషయంలోకి వెళ్తే, ఆ డ్రస్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చి,స్టేజ్ పైకి వెళ్లీ వెళ్లగానే, వీపు వైపున చిరిగిపోయింది. కానీ ఎలాగోలా మ్యానేజ్ చేసి షోను పూర్తి చేసేసింది. ఫంక్షన్ ముగిసిన తర్వాత ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ఇలాంటిది ఎందుకు వేసుకున్నానురా అని బాధపడిందట. అయినా అసలు ఇలాంటి డ్రస్సులు వేసుకోవడమెందుకో..చిరిగిందని తర్వాత బాధపడటమెందుకో..