Read more!

English | Telugu

మాకు బ్రేకప్ లు అలవాటే


 

బ్రేకప్. ఇప్పుడు ఇది చాలా కామన్ గా వాడే పదం. మరీముఖ్యంగా సినీ సెలబ్రిటీలకైతే, ఎవరు ఎవర్ని తగులుకుంటారో, ఎప్పుడు బ్రేకప్ లు చేప్పేసుకుంటారో తెలియని పరిస్థితి. కొన్ని జంటలైతే కేవలం రోజుల వ్యవధిలోనే విడిపోతున్నారు.రణ్ బీర్-దీపిక, నెస్ వాడియా-ప్రీతీజంటా,సల్మాన్-ఐశ్వర్య,రణ్ బీర్-కత్రినా,షాహిద్-కరీనా ఇలా బ్రేకప్ లిస్ట్ చాలా పెద్దదే ఉంది.రణ్ బీర్-కత్రినాలైతే, విడిపోకముందు, తమ లవ్ స్టాటస్ ను ఏకంగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ కు తీసుకెళ్లారు. చివరికి ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు.

మంచినీళ్లు తాగినంత ఈజీగా తగులుకోవడం,వదిలించుకోవడం ఇప్పటి సినీతారలకు అలవాటైపోయింది.తాజాగా, ఇండియాలోనే హాటెస్ట్ హ్యాపెనింగ్ కపుల్ విరాట్- అనుష్క ల మధ్య కూడా బ్రేకప్ అయినట్టు కనిపిస్తోంది.అనుష్క ఇన్ స్టాగ్రాం ను విరాట్ అన్ ఫాల్ చేయడం, అనుష్క కూడా విరాట్ ను అన్ ఫాలో అవడం బట్టి చూస్తే, ఇద్దరికీ చెడినట్టే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.


 ఒకప్పుటి లవ్ బర్డ్స్ అయిన అమితాబ్-జయ, ధర్మేంద్ర-హేమమాలిని,పటౌడీ-షర్మిలా టాగూర్ లాంటి వాళ్లందరూ తమ ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లి, చిరకాలం దాన్ని నిలుపుకున్నారు.కానీ ఇప్పుడు మాత్రం ప్రేమ నిలబడటం అనేది చాలా కష్టంగా మారిపోయింది.కలకాలం అన్న మాటను పక్కన పెట్టి, పట్టుమని పది రోజులు కలిసుండటమే గగనంగా మారిందంటే విచిత్రం లేదు. ఇన్నాళ్లూ, హాలీవుడ్ లోనే ఉన్న ఈ కల్చర్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా రాజ్యమేలుతోంది.వాళ్ల వ్యక్తిగత జీవితాలు వాళ్ల ఇష్టం కావచ్చు,కానీ పది మందికి స్ఫూర్తిగా నిలవాల్సిన ఈ అభిమాన తారలు చేసే ప్రతీ పనీ వాళ్ల అభిమానుల మీద,సినీ ప్రేక్షకుల మీద తప్పక ప్రభావం చూపిస్తుంది. అదే సమాజంలో కూడా ప్రతిఫలిస్తుందనడం మాత్రం వాస్తవం.