Read more!

English | Telugu

కుర్రాడికి పోజులెక్కువే సుమీ..!

ఒక సినిమా చేశారో లేదో.. స్టార్స్ అయిపోతుంటారు కొంత‌మంది. సెల‌బ్రెటీ హోదా వ‌చ్చేసిన‌ట్టు.. తామేం చేసినా చెల్లుబాటు అయిపోయిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుంటారు. అల్లుడు శ్రీ‌ను - బెల్లంకొండ శ్రీ‌నివాస్ కూడా ఆ టైపే అనిపిస్తోంది. చేసింది ఒక సినిమా.. రెండో సినిమా విడుద‌ల అవుతోంది.. ఇంత‌లోనే స్టార్‌లా కాల‌ర్ ఎగ‌రేస్తున్నాడు.  స్పీడున్నోడు చేస్తున్న‌ప్పుడు భీమినేని శ్రీ‌నివాస‌రావుతో ముప్పు తిప్ప‌లు పెట్టి.. మూడు చెరువుల నీళ్లు తాగించాడ‌ట‌. మార్పులూ, చేర్పులూ, కాస్ట్యూమ్స్ విష‌యంలో శ్రీ‌ను.. చాలా ఇబ్బంది పెట్టాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ కోడై కూస్తోంది. అంతేకాదు.. గురువారం ప్రెస్‌మీట్‌కీ గంట‌న్న‌ర ఆల‌స్యంగా వ‌చ్చి మీడియాకూ షాక్ ఇచ్చాడు.

 

 

సినిమా సినిమాకీ బ‌డ్జెట్ పెరిగిపోతోంది.. తిరిగి రాబ‌ట్టుకోవ‌డం క‌ష్టం క‌దా? అని అడిగితే ' తొలి సినిమాకి రూ.40 కోట్లు పెడితే.. రెండో సినిమా రూ5 కోట్ల‌తో చేయ‌లేను క‌దా. బ‌డ్జెట్ పెంచుకోవ‌డం త‌ప్పేంటి?   తిరిగి వ‌చ్చేస్తాయి క‌దా..' అని రివ‌ర్స్‌లో స‌మాధానం చెబుతున్నాడు. అంటే ఈ బాబుకి ప‌దో సినిమాకి వ‌చ్చేస‌రికి రూ.200 కోట్ల పెట్టుబ‌డి పెట్టాలేమో..??  ' స్పీడున్నోడు' అని సినిమాకి పేరు పెట్టుకొంటే చాలు.. ఇలా స్పీడు స్పీడుగా బడ్జెట్‌పెంచుకొంటూ పోతే... నిర్మాత‌లు బొక్క‌బోర్లా ప‌డ‌తారు బాబూ.. ఈ సంగ‌తి గుర్తెట్టుకో మ‌రి.