Read more!

English | Telugu

ఆ హీరోయిన్ కు పెళ్లైపోయింది..

బాలయ్యబాబుతో రావయ్యా ముద్దుల మామా అంటూ చిందేసిన సంఘవి ఎట్టకేలకు ఒక ఇంటిదైంది.బుధవారం ఉదయం 9 గంటలకు, బెంగుళూరు లోని తాజ్ వివాంతా హోటల్ లో ఆమె వివాహం జరిగింది.బెంగుళూర్ కు చెందిన ఐటి సంస్థ అధినేత ఎన్ వెంకటేశ్ ను,సినీ ప్రముఖులు,సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకుంది.కర్ణాటకలో జన్మించిన సంఘవి అసలు పేరు కావ్యారమేష్.తమిళంలో అజిత్ తో కలిసి నటించిన ' అమరావతి ' ఆమె మొదటి సినిమా. దక్షిణాదిలో దాదాపు అందరు అగ్రహీరోలతో కలిసి నటించినా,వందకు పైగానే సినిమాలు చేసినా ఈ అమ్మడికి బ్రేక్ రాలేదు. ఆ తర్వాత అనేక టెలివిజన్ షోస్ లో జడ్జ్ గా కూడా చేసింది.. సంఘవి కన్నడ అమ్మాయి కాగా వెంకటేశ్ మళయాళీ కావడం విశేషం..