English | Telugu

బాహుబలి సీక్రెట్ ను విప్పేస్తాడా..?

టాలీవుడ్ జక్కన రాజమౌళి శైలే వేరు. సినిమాలను అద్భుతంగా తెరకెక్కించడమే కాక, వాటి ప్రచారానికి కూడా వైవిధ్యమైన మార్గాలు ఎంచుకుంటుంటాడు. అందుకే టాలీవుడ్ లో ఎవరికీ లేని సక్సెస్ గ్రాఫ్ రాజమౌళి సొంతమైంది.తాజాగా తన బాహుబలి పార్ట్ 2 ను చెక్కుతున్న జక్కన్న, ఆ సినిమా పబ్లిసిటీ కోసం కూడా విభిన్నమైన మార్గం ఎంచుకున్నాడు.గ్రాఫిక్ ఇండియా సంస్థ తో కలిసి బాహుబలి కథను డిజిటల్ గ్రాఫిక్ నవలలుగా రిలీజ్ చేయబోతున్నాడు.దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

దీని కథ సినిమా కథ కంటే లోతుగా,పాత్రలు మరింత విస్తృతంగా ఉంటాయని ఊరిస్తున్నాడు రాజమౌళి.భవిష్యత్తులో బాహుబలికమెర్చండైజ్ ను, ' బాహుబలి లాస్ట్ లెజండ్స్ ' పేరుతో యానిమేషన్ ప్రాజెక్ట్ ను కూడా తీసుకురాబోతున్నారట.ఇవన్నీ జక్కన్న పర్యవేక్షణలోనే జరగనున్నాయి.మరి ఈ కామిక్ నవలలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్న ప్రశ్నకు ఆన్సర్ ఉంటుందో లేదో తెలియాలంటే,అవి రిలీజయ్యే వరకూ ఆగాల్సిందే..

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.