Read more!

English | Telugu

బూతు వైపే మొగ్గు

బాలీవుడ్ మూవీస్ లో ఇప్పుడు బూతు రాజ్యమేలుతోంది. ప్రతీ ఇండస్ట్రీలోనూ అడల్ట్ మూవీస్ కి ఫ్యాన్స్ ఉన్నప్పటికీ,బాలీవుడ్ ఇది కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. విషయమేంటంటే, సన్నీ లియోన్ ద్విపాత్రాభినయం చేసిన అడల్ట్ రేటెడ్ సినిమా ' మస్తీ జాదే ', మాధవన్ బాక్సింగ్ కోచ్ గా నటించిన ' సాలా ఖడూస్ ' రెండూ కూడా శుక్రవారం రిలీజయ్యాయి.

విచిత్రమేంటంటే, రెండింటిలోనూ సన్నీ సినిమాకే ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్ లు  జరిగాయి.ఓపెనింగ్స్ లో కూడా ఈ మూవీ అదరగొట్టింది. ఇండియా వైడ్ మస్తీజాదే కలెక్షన్ 6.5 కోట్లు కాగా, మాధవన్ సినిమా కేవలం 2.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది..కానీ మస్తీ జాదే పెద్దల స్థాయిని కూడా దాటేసిన సినిమా అని విమర్శలు వస్తున్నాయి..ఓపెనింగ్ కలెక్షన్స్ సన్నీ సినిమాకే ఎక్కువగానే ఉన్నా, లాంగ్ రన్ మాత్రం సాలా ఖడూస్ కే ఉంటుందనేది ట్రేడ్ వర్గాల అంచనా..