English | Telugu

' సర్దార్ గబ్బర్ సింగ్ ' అభిమానులకు శుభవార్త

పవన్ సర్దార్ కు వచ్చినన్ని సమస్యలు బహుశా ఆయన మరే సినిమాకు రాలేదేమో. సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఆగిపోవడం, డైరెక్టర్ ను మార్చడం, షూటింగ్ మళ్లీ మొదలైనా ఏదొక సమస్యతో స్లోగా షూటింగ్ నడవడం లాంటి ప్రాబ్రమ్స్ సినిమాను చుట్టుముట్టాయి. దీంతో రిలీజ్ డేట్ మారుతుందేమో,సినిమా లేట్ గా రిలీజ్ అవుతుందేమోనన్న భయాందోళనలు పవన్ ఫ్యాన్స్ లో చోటుచేసుకున్నాయి. వాళ్లకు శుభవార్త ఏంటంటే, ఇప్పుడు షూటింగ్ ఏ ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా సాగడంతో పాటు రిలీజ్ డేట్ లో కూడా ఏ మార్పూ లేదట.ముందు అనుకున్నట్లుగానే ఏప్రిల్ 8 న సినిమాను రిలీజ్ చేస్తారని మూవీ టీం నిర్ధారిస్తున్నారు.

గత కొన్ని రోజులుగా, సర్దార్ రిలీజ్ డేట్ మారిపోయిందని, చాలా లేటుగా రిలీజ్ అవబోతోందనే ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు సినిమా టీం రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేయడంతో, పవన్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. కాజల్, పవన్ జంటగా నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ ను పవన్, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సినిమాకు స్వయంగా పవనే కథ స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.