Read more!

English | Telugu

మీడియా ఉంది... చూసుకోండి సార్‌...!!


సెల‌బ్రెటీల చుట్టూనే మీడియా తిరుగుతుంటుంది. వాళ్లేం మాట్లాడినా వార్తే! కాలు క‌దిపితే చాలు.. కెమెరాలు, మైకులు చుట్టు ముట్టేస్తాయి. మీడియా మాట ప‌క్క‌నెట్టండి. స్టార్ క‌నిపిస్తే చాలు.. అభిమానులు సెల్‌ఫోన్ ఆన్ చేసేస్తున్నారు. అలాంట‌ప్పుడు స్టార్లు ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలి??  కానీ.. కొంత‌మంది మాత్రం మీడియా ఉంది... అన్న స్పృహ‌నే కోల్పోతున్నారు. నిన్న‌టికి నిన్న బాల‌కృష్ణ మీడియా మైకులు చుట్టుముట్టిన‌ప్పుడు కూడా ఓ బూతు మాట వాడేశారు.  ఆ 5 సెక‌న్ల వీడియో ఇప్పుడు ఆన్ లైన్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

 

అంత‌కు ముందు చిరంజీవి ఓ అభిమాని ని క‌సురుకున్న వీడియో.. ఒక‌టి హ‌ల్ చ‌ల్ చేసింది. అభిమానుల్ని అర్థం చేసుకొనే తీరు ఇదేనా? అంటూ యాంటీ మెగా ఫ్యాన్స్ చిరుని నిల‌దీశారు. గుంటూరు టాకీస్ ట్రైల‌ర్ ఆవిష్క‌రించ‌డానికి వ‌చ్చిన బాల‌కృష్ణ మ‌రోసారి విశ్వ‌రూపం చూపించాడు. అక్క‌డున్న శ్ర‌ద్దాదాస్‌, రేష్మిల‌పై హాట్ హాట్ జోకులు పేల్చాడు. అవ‌న్నీ.. మీడియా రికార్డ్ చేసింది కూడా. కానీ.. బ‌య‌ట‌పెట్ట‌డానికి సాహ‌సించ‌లేదు. బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు, కెమెరాలు ముందున్న‌ప్పుడు, మీడియా మ‌న‌ల్ని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తోంది అనుకొన్న‌ప్పుడు సెల‌బ్రెటీలు కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి క‌దా?  లేదంటే అభిమానుల‌కు త‌ప్పుడు సంకేతాలు అందుతాయి.. చిరు, బాలయ్య‌... కాస్త చూసుకోండ‌య్యా!