English | Telugu

స్టైల్ మారింది గురూ..

ఒకప్పుడు స్టైల్ అంటే కేవలం డ్రస్సింగ్ మాత్రమే.ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ లాంటి వాళ్లు తమ బెల్ బాటమ్స్ తో ట్రెండ్స్ సృష్టించేవారు.కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోల్లో ఎవరికి వారు తమ స్టైల్ నే ట్రెండ్ గా సెట్ చేస్తున్నారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్, ఇలా అందరూ కూడా తమ స్టైల్స్ తో ఇరగదీస్తున్నారు.

సినిమా సినిమాకూ మారుతూ, తన స్టైల్ తో అదరగొడుతూ దాన్నే బిరుదుగా మార్చుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.సినిమాల్లో తన కస్ట్యూమ్స్ మాత్రమే కాక, సినిమా కోసం అవసరమైనట్టు హెయిరస్టైల్స్ ను,బాడీ లుక్స్ ను మార్చుకోవడానికి సిద్ధపడుతుంటాడు బన్నీ. తనను తాను ఎప్పటికప్పుడు స్టైలిష్ గా తీర్చిదిద్దుకోవడంలో ముందుంటాడు.దేశముదురులో బాడీ బిల్డప్ చేయడమే కాక,లాంగ్ హెయిర్ తో తన ఇమేజ్ ను పూర్తి స్టైలిష్ గా మార్చేసుకున్నాడు.వరుడు, వేదం సినిమాల్లో ఒక డిఫరెంట్ లుక్, రుద్రమ దేవిలో వేసిన గోనగన్నారెడ్డి క్యారెక్టర్ కు రగ్గడ్ అండ్ రఫ్ లుక్ తో, క్యారెక్టర్ కోసం ఎంతవరకూ అయినా వెళ్తున్నాడు బన్నీ..

టాలీవుడ్ హీరోల్లో మోస్ట్ హ్యాండ్ సమ్ ఎవరు అని అడిగితే,టక్కున చెప్పే పేరు మహేష్. పోకిరీ,సైనికుడు,అతిథి సినిమాల్లో మహేష్ కూడా లాంగ్ హెయిర్ లాంటి వెరైటీ లుక్స్ ట్రై చేశాడు.కానీ తర్వాత ఏమైందో ఏమో కానీ, తన లుక్స్ ను కేవలం డ్రెస్సెంగ్ కు పరిమితం చేసేశాడు. తన డ్రెస్సింగ్ అండ్ స్టైల్ విషయంలో చాలా కేర్ తీసుకునే మహేష్ కు, భార్య నమ్రతే కాస్ట్యూమ్స్ సెలక్ట్ చేస్తుండటం విశేషం.

మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైల్ పట్ల తనకున్న ఇంట్రస్ట్ ను నాన్నకు ప్రేమతో సినిమాతో బయటపెట్టాడు. బృందావనం టైం లోనే మీసం తీసేసి క్లాస్ లుక్ లోకి రావడానికి ట్రై చేసిన ఎన్టీఆర్, ఆ తర్వాతి సినిమాల్లో కూడా తన డ్రెస్సింగ్ పై స్పెషల్ ఇంట్రస్ట్ తీసుకున్నాడు.టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాల్లో ఈ స్టైలిష్ నెస్ కనిపిస్తుంది..నాన్నకు ప్రేమతో సినిమాలో తన హెయిర్ స్టైల్ తో యూత్ మొత్తాన్ని మెస్మరైజ్ చేశాడు తారక్.యూత్ లో చాలామంది ఇప్పుడు ఇదే హెయిర్ స్టైల్ తో కనిపించడం విశేషం.

మెగా తనయుడిగా ఎంటరై, తనకంటూ మార్క్ క్రియేట్ చేసుకున్న రామ్ చరణ్ స్టైల్ విషయంలో, ఎవరికీ తీసిపోడు. ముఖ్యంగా సాంగ్స్ లో ఆయన వేసే కాస్ట్యూమ్స్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.ఆరెంజ్ ను చెర్రీ డ్రెస్సింగ్ కోసమే మళ్లీ చూసిన వాళ్లు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. నాయక్ లోని పబ్ సాంగ్ లో చెర్రీ వేసిన షర్ట్ విపరీతంగా సేల్ అవడంతో పాటు గోవిందుడు అందరివాడేలే లో చెర్రీ గాగుల్స్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యాయి.సిటీ కుర్రాడి పాత్రకు తగ్గట్టుగా పోనీ టెయిల్ వేసి ట్రెండీ లుక్స్ తో అదరగొట్టాడు.

ఇలా మన యంగ్ హీరోలంతా, టాలీవుడ్ లో తమ స్టైల్ తో ట్రెండ్ సెట్ చేస్తూ దుమ్ము రేపుతున్నారు. బెల్ బాటమ్స్ తో మొదలైన టాలీవుడ్ స్టైలింగ్, ఇప్పుడు క్యారెక్టర్ కోసం పూర్తిగా తమను తాము మార్చుకునే వరకూ వెళ్లడం విశేషం.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.