English | Telugu

మోడీతో చిరు మాజీ అల్లుడు..

ఓవైపు మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజకు నిశ్చితార్ధం అయిందనే పుకార్లు వస్తున్న టైంలోనే, శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మోడీని కలవడం చర్చనీయాంశంగా మారింది.గతంలోనే బిజేపీ మెంబర్ అయిన శిరీష్ 2014 ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉన్నా,కొన్ని పరిస్ధితుల కారణంగా అతన్ని బిజేపీ పక్కన పెట్టింది. ఈ రెండేళ్ల పాటు జాడలేని శిరీష్,మళ్లీ ఇన్నాళ్లకు మోడీని కలవడం వెనుక మతలబు ఏంటా అనేది ఇప్పుడు చాలామందిని తొలుస్తున్న ప్రశ్న..

శ్రీజ నుంచి విడాకులు తీసుకున్నాక, బిజేపీలో చేరాడు శిరీష్.పార్టీలో చేరిన సమయంలో మాత్రమే అతని పేరు కొద్దిగా వార్తల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో చిరంజీవికి వ్యతిరేకంగా శిరీష్ తో ప్రచారం చేయింది పార్టీకి మైలేజ్ తీసుకురావాలనుకున్న బిజేపీ, అందుకు శిరీష్ ఒప్పుకోకపోవడంతో అతన్ని సైడ్ చేశారు. ఆ తర్వాత బిజేపీలో అతని స్థానమేంటన్న విషయం కూడా ఎవరికీ తెలియదు.అలాంటి శిరీష్ ఇప్పుడు సడెన్ గా ఢిల్లీలో ప్రధానమంత్రి పక్కన ఎలా ప్రత్యక్షమయ్యాడు. పిఎం తో మీటింగ్ అంటే మాటలు కాదు.ఈ అప్పాయింట్ మెంట్ ను శిరీష్ ఎలా సంపాదించగలిగాడు..? కరెక్ట్ గా శ్రీజ నిశ్చితార్ధం అంటున్న ఈ టైంలోనే అతను మోడీని కలవడం వెనుక ఉన్న అంతరార్ధమేంటి..? అసలు ఇవి ఇప్పటి ఫోటోలేనా..? ఈ ప్రశ్నలకు ఇప్పటికైతే సమాధానం లేదు.కొద్ది రోజుల్లో దీనికి ఆన్సర్ దొరుకుతుందేమో చూడాలి..

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.