English | Telugu

ఓట‌మి భ‌యంలో ష‌న్ను.. స‌న్నీ ఫ్యాన్స్‌పై కామెంట్స్‌

బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట‌రైన ప్ర‌తీ ఒక ఇంటి స‌భ్యుల‌కు ఏదో ఒక నిక్‌నేమ్‌ని పెట్టిన విష‌యం తెలిసిందే. ఇదే క్ర‌మంలో ష‌ణ్ముఖ్‌కి బ్ర‌హ్మ అని పేరు పెట్టారు. ఏ ముహూర్తాన ఆ పేరుని త‌న‌కి పెట్టారో కానీ ష‌న్ను మాత్రం బిగ్‌బాస్ హౌస్‌కి తానే బ్ర‌హ్మ అన్న‌ట్టుగా ఫీల‌వుతున్నాడు. చాలా వ‌ర‌కు సిరితో క‌లిసి సేఫ్ గేమ్ ఆడుతూ టాస్కుల్లో పెద్ద‌గా ప్ర‌భావం చూపిచ‌ని ష‌న్ను త‌న‌కే అంతా తెలుసున‌ని, అంతా తానేని అపోహ‌ప‌డుతూ మిగ‌తా వారిని మ‌రీ ముఖ్యంగా స‌న్నీ, అత‌నికి ఓట్లు వేసేవారిని విమ‌ర్శిస్తుంద‌డ‌టం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.