మీకు నచ్చినట్లు కాకుండా వాడికి నచ్చినట్లు ఉండనివ్వండి.. దీప్తి ఎమోషనల్ పోస్ట్!
బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకొచ్చేసింది. డిసెంబర్ 19న (వచ్చే ఆదివారం) ఈ సీజన్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. బరిలో ఐదుగురు కంటెస్టెంట్లు.. సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, శ్రీరామచంద్ర, మానస్, సిరి హన్మంత్ మిగిలారు. వీరిలో సన్నీ, షణ్ణు మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఆ ఇద్దరిలో సన్నీయే విజేత అంటూ సోషల్ మీడియాలో పలువురు ప్రచారం కూడా చేస్తున్నారు.