English | Telugu

బిగ్‌బాస్ విజేత‌పై మ‌రోసారి క్లారిటీ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

బిగ్‌బాస్ సీజ‌న్ 5 క‌థ క్లైమాక్స్‌కు చేరింది. 13వ వారం ఎండ్ కావ‌డం.. ప్రియాంక సింగ్ ఎలిమినేట్ కావ‌డంతో హౌస్‌లో ప్ర‌స్తుతం 6 గురు స‌భ్యులు మాత్ర‌మే వున్నారు. ఈ ఆరుగురిలో వ‌చ్చేవారం మ‌రొకరు ఎలిమినేట్ కానున్నారు. మిగ‌తా స‌భ్యులు టాప్ 5కి చేర‌బోతున్నారు. ఇదిలా వుంటే బిగ్‌బాస్ సీజ‌న్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ తాజా సీజ‌న్ విజేత ఎవ‌రో అప్పుడే చెప్పేశాడు. సీజ‌న్ 3లో టైటిల్ రేస్‌లో లేని రాహుల్ అనూహ్యంగా టైటిల్ విజేత‌గా నిలిచిన విష‌యం తెలిసిందే.

తాజాగా బిగ్‌బాస్ సీజన్ 5 విజేత ఎవ‌ర‌న్న దానిపై చ‌ర్చ జ‌రుగుతున్న వేళ రాహుల్ సిప్లిగంజ్ త‌న మ‌ద్ద‌తు ఎవ‌రికో.. ఇంత‌కీ ఈ సీజ‌న్ విజేత ఎవ‌రో బ‌య‌ట‌పెట్టేశారు. చాలా మంది ర‌క ర‌కాల అభిప్రాయాల్ని వ్య‌క్తం చేస్తున్న వేళ రాహుల్ అన్న మాట‌లు అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. గ‌త సీజ‌న్ విజేత గురించి ముందే ఊహించిన రాహుల్ అదే త‌ర‌హాలో సీజ‌న్ 5 విజేత ఎవ‌ర‌న్న‌ది స్ప‌ష్టం చేశాడు. అత‌నెవ‌రో కాదు వీజే స‌న్నీ. త‌ను గేమ్ బాగా ఆడుతున్నాడ‌ని, అయితే తాను ఎవ‌రినీ ప్ర‌భావితం చేయాల‌నుకోవ‌డం లేద‌ని చెప్పుకొచ్చాడు.

ఈ సీజ‌న్ విన్న‌ర్ అత‌నేనా? సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌!

అయితే వార్ వ‌న్‌సైడ్ అయ్యిందంటూ హార్ట్‌ సింబ‌ల్‌ని పోస్ట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక హౌస్‌లో వున్న స‌భ్యుల్లో చాలా మంది ప్రాణం పెట్టి ఆడుతున్నార‌ని. టాప్ ఫైవ్ కోసం భారీగానే క‌ష్ట‌ప‌డుతున్నార‌ని చెప్పుకొచ్చాడు రాహుల్‌. మ‌రి రాహుల్ చెప్పిన‌ట్టుగానే వీజే స‌న్నీ ఈ సీజ‌న్ వి.ఏత‌గా నిలుస్తాడో తెలియాలంటే మ‌రో రెండు వారాలు వేచి చూడ‌క త‌ప్ప‌దు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.