English | Telugu

చిన్న‌ప్పుడు ఇందిరా పార్క్‌లో ఆడుకుంటుంటే ఒక‌డు లాక్కెళ్లిపోయాడు!

సింగ‌ర్ నుంచి న‌టిగా మారిన అమ్మాయి స్నిగ్ధ‌. నందినీరెడ్డి డైరెక్ట్ ఫ‌స్ట్ ఫిల్మ్ 'అలా మొద‌లైంది' న‌టిగా స్నిగ్ధ‌కు ఫ‌స్ట్ ఫిల్మ్‌. ఆ మూవీలో హీరో హీరోయిన్లు నాని, నిత్యా మీన‌న్‌కు కామ‌న్ ఫ్రెండ్ అయిన పింకీ పాత్ర‌తో ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత పాతిక పైగా సినిమాల్లో క‌నిపించిందామె. ఈ ఏడాది 'యు ఆవ‌కాయ్ మి ఐస్ క్రీమ్' అనే వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేసింది. ప్ర‌స్తుతం జీ తెలుగులో ప్ర‌తి ఆదివారం ప్ర‌సార‌మ‌వుతున్న 'సూప‌ర్ క్వీన్' షోలో ఒక కంటెస్టెంట్‌గా ఆమె పార్టిసిపేట్ చేస్తోంది. ఈ షోకు ప్ర‌దీప్ మాచిరాజు యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

చూడ్డానికి టామ్ బాయ్‌లా, చాలా జోవియ‌ల్‌గా క‌నిపించే స్నిగ్ధ కూడా చిన్న‌త‌నంలోనే వేధింపుల‌కు గుర‌య్యిందంటే సాధార‌ణంగా ఎవ‌రూ న‌మ్మ‌రు. కానీ ఆమే స్వ‌యంగా చెప్పింది కాబ‌ట్టి న‌మ్మాల్సిందే. 'సూప‌ర్ క్వీన్' షోలో ల‌వ్ స్టోరీ ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు, "ల‌వ్ స్టోరీస్ లాంటివి ఎక్కువ ఉండేవి కావు. ఎందుకంటే నా ద‌రిదాపుల్లోకి ఎవ‌రూ వ‌చ్చేవాళ్లు కాదు. కొడ‌తానేమోన‌ని భ‌యం. స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జ‌రిగింది. మాకు రెండు బిల్డింగుల మ‌ధ్య‌లో ఒక ర్యాంప్ ఉండేది. అక్క‌డ్నుంచి ఒక‌బ్బాయి అరుస్తున్నాడు. చూశా.. చూశా.. ఆ త‌ర్వాత నా పేరు చెప్పి ఐ ల‌వ్యూ అని అరిచాడు. పేరు విన‌ప‌డ‌గానే, దొరికిందే సంద‌ని ఒక్క‌సారిగా ప‌రిగెట్టుకొని వెళ్లాను." అని చెప్పింది స్నిగ్ధ‌.

Also read:ష‌ణ్ణు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి కౌగ‌లించుకుంటేనే టాబ్లెట్ వేసుకుంటాన‌ని మొండికేసిన సిరి!

ఇదే సంద‌ర్భంగా చిన్న‌త‌నంలో త‌న‌కు ఎద‌రైన ఓ ఘ‌ట‌న‌ను ప్ర‌స్తావించింది. "ప్ర‌తి అమ్మాయీ ఏదో ఒక వ‌య‌సులో వేధింపుల‌కు గుర‌వుతుంది. నాక్కూడా ఏమీ తెలీని వ‌య‌సులో హెరాస్‌మెంట్ ఎదుర‌య్యింది. అప్ప‌ట్నుంచీ నేను స్ట్రెంగ్తెన్ అవుతూ వ‌చ్చాను. నేను సైలెంట్‌గా ఉండ‌కూడ‌దు. అనుకున్నాను. నేనా మ‌నిషిని ఎలా త‌న్న‌గ‌లిగానో నాకు తెలీదు. ఫిఫ్త్ క్లాస్‌లో హెరాస్‌మెంట్ జ‌రిగిన‌ప్పుడు ఆ ట్రామా నుంచి కోలుకోవ‌డానికే చాలా టైమ్ ప‌ట్టింది. నిజానికి అది జ‌రిగింది కూడా ఇందిరా పార్కులో. నేను ఆడుకోవ‌డానికి వెళ్తుంటే ఒక‌త‌ను లాక్కెళ్లిపోయాడు. సో.. ఇందిరా పార్క్ వేపు నుంచి వెళ్తున్న‌ప్పుడ‌ల్లా నాకు బ‌ట‌ర్‌ఫ్లై ఫీలింగ్ వ‌చ్చేది." అని చెప్పుకొచ్చిందామె.

Also read:రోజాకు అడ్డంగా దొరికి పోయిన జ‌బ‌ర్ద‌స్త్ జోడీ!

"అదృష్ట‌మో, దుర‌దృష్ట‌మో 2007లో హిమాయ‌త్ న‌గ‌ర్ ఏరియాలోనే ఇంట్లో ఉండాల్సి వ‌చ్చింది. అప్పుడు రోజూ కావాల‌ని ఇందిరా పార్క్ వేపు వెళ్లేదాన్ని. దానికి ఆనుకొని ఉన్న టెన్నిస్ కోర్టులో నేను టెన్నిస్ నేర్చుకున్నాను. 'దాన్ని అధిగ‌మించాలి. టిమిడ్‌గా ఉండొద్దు.' అని దాన్నుంచి బ‌య‌ట‌ప‌డ్డాను. మా చెల్లివాళ్ల‌కు కూడా చెప్పేదాన్ని.. 'ఊరుకోవ‌ద్దు, తిరిగిచ్చెయ్యండి' అని. ప్ర‌తి అమ్మాయికీ అదే చెప్తాను.. ఊరుకొనే కొద్దీ ఇలాగే ఉంట‌ది. ధైర్యంగా ఉండండి. శ‌క్తిమంతంగా ఉండండి." అంటూ సందేశం ఇచ్చింది స్నిగ్ధ‌.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.