English | Telugu

నా దునియాల నేను హీరోనే: స‌న్నీ

 ​బిగ్‌బాస్ క‌థ క్లైమాక్స్ కి చేరింది. ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే జ‌ర‌గ‌బోతోంది. టాప్ 5లో నిలిచిన కంటెస్టెంట్ ల‌లో విజేత ఎవ‌ర‌న్న‌ది ఓ ప‌క్క ఉత్కంఠ రేపుతున్నా విజేత ఎవ‌రేది ఇప్ప‌టికే క్లారిటీ వ‌చ్చేసింది. గ్రాండ్ ఫినాలేకు మ‌రో రెండు రోజులే వుండ‌టంతో బిగ్ బాస్ పాత టాస్కుల‌ని కంటెస్టెంట్ ల‌కి మ‌రోసారి గురువారం గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఇది స‌న్నీ, సిరిల మ‌ధ్య గొడ‌వ‌కు దారి తీసింది. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగింది. స‌న్నీ ఓడిపోయావ్ అని అన‌గానే ఆ మాట విన‌డం ఇష్టంలేని సిరి స‌న్నీపై చిందులు తొక్కింది. నువ్వేమైనా హీరో అనుకుంటున్నా? అంటూ నాతో జోకులొద్దు అని వార్నింగ్ ఇచ్చింది.

నిన్న‌టి వ‌ర‌కు సిరి ఫ్రెండ్.. కానీ ఇప్ప‌డు పెళ్లాం?

బిగ్‌బాస్ లో ష‌న్ను, సిరిల అరాచ‌కం ప‌రాకాష్ట‌కు చేరింది. మ‌రో రెండు రోజుల్లో సీజ‌న్ ఎండ్ అవుతున్న నేప‌థ్యంలో హౌస్ లో వీరి చేష్ట‌లు ప‌తాక స్థాయికి చేరుకున్నాయి. ఎంత‌లా అంటే చూసే  ఆడియ‌న్స్ కి వెగ‌టు పుట్టించేలా. గ‌త కొన్ని వ‌రాలుగా పేరెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి వీళ్ల అతి చేష్ట‌ల‌కు చివాట్లు పెట్టినా `న‌వ్విపోదురుగాక మాకేటి సిగ్గు` అన్న‌ట్టుగా ష‌న్ను, సిరి వ్య‌వంహ‌రిస్తూ హౌస్ లో గ‌బ్బు లేపుతున్నారు. పేరెంట్స్ హ‌గ్గులు మితిమీరు తున్నాయ‌ని, అది మాకు న‌చ్చ‌డం లేద‌న్నా.. ఆంటీ ఇది ఫ్రెండ్షిప్ హ‌గ్ మాత్ర‌మే అంటూ నిస్సిగ్గుగా సిరిని హ‌గ్ చేసుకుంటూనే వున్నాడు ష‌న్ను.