English | Telugu

`కార్తీక దీపం` :  కార్తీక్ జీవితం త‌ల‌కిందులు

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని మ‌రీ ముఖ్యంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్నసీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొన్ని వారాలుగా చిత్ర విచిత్ర‌మైన మ‌లుపుల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్ ప్ర‌స్తుతం షాకింగ్ ట్విస్ట్‌ల‌తో సాగుతోంది. ఈ శ‌నివారం ఈ సీరియ‌ల్ 1214వ ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సంవ‌ద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు చోటుచేసుకోబోతున్నాయి. కార్తీక్ గుండె ఆప‌రేష‌న్ చేయ‌డానికి రెడీ అవుతున్న స‌మ‌యంలో పేషెంట్ భార్య‌, పిల్ల‌లు.. కార్తీక్‌ని క‌ల‌సి అత‌ని కాళ్ల‌పై ప‌డి వేడుకోవ‌డం తెలిసిందే.

క‌ట్ చేస్తే `ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లో పేషెంట్‌కి ఆప‌రేష‌న్ చేస్తూ కార్తీక్ క‌ళ్ల‌కు బైర్లు క‌మ్మేస్తాయి.. ఆ స్థితి నుంచి కార్తీక్ తేరుకోకుండానే ఆప‌రేష‌న్ చేయ‌డానికి సిద్ధ‌మై ఆప‌రేష‌న్ చేసేస్తాడు. ఏదో త‌ప్పు జ‌రుగుతోంద‌ని గ‌మ‌నించిన ర‌వి .. ఆ మ‌త్తు నుంచి తేరుకో కార్తీక్‌.. చంపేశావ్ కార్తీక్‌.. అత‌ను చ‌నిపోయాడు` అని అరుస్తాడు. ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌ కార్తీక్? .. ఇప్పుడు ఆ బాధ్య‌త ఎవ‌రిది? అంటూ కార్తీక్‌ని నిల‌దీస్తాడు. `అరె ప్రియ‌మ‌ణి.. మీ కార్తీకయ్య ప‌ని ఔట్ ప్రియ‌మ‌ణి.. అత‌డి జీవితాన్ని తీర‌గ‌రాసేశాను. నువ్వు ఇచ్చిన ఈ కాఫీతోనే తిర‌గ‌రాసేశాను.

నువ్వు వెళ్లు ప్రియ‌మ‌ణి.. నువ్వు వెళ్లు నీకు అర్థం కావ‌డానికి ఇంకా కొంత టైమ్ ప‌డుతుంది` అంటుంది మోనిత‌. ప్రియ‌మ‌ణి వెళ్ల‌గానే .. కార్తీక్ ఆప‌రేష‌న్‌కి వెళ్లే ముందు ఏం జ‌రిగిందో త‌లుచుకుంటుంది. మోనిత‌కి మెసేజ్ పెట్టిన జ‌యంతి.. కార్తీక్ ఆప‌రేష‌న్‌కి వెళ్లేముందు త‌ను తాగిన కాఫీలో రెండు నిద్ర మాత్ర‌లు క‌లుపుతుంది. అది తాగిన మ‌త్తులో కార్తీక్ గుండె ఆప‌రేష‌న్‌కి వెళ‌తాడు.. ఆ త‌రువాత జ‌రిగింది తెలిసిందే.. ఇదే విష‌యాన్ని తలుచుకుంటూ మోనిత ఏం చేస్తుందిలే అనుకున్నావ్ క‌దా కార్తీక్‌.. చేసి చేపించాను క‌దా,, నీ ప‌ని ఔట్ అంటుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? ఆప‌రేష‌న్ త‌రువాత కార్తీక్ ప‌రిస్థితి ఏంటీ? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.