English | Telugu

ష‌ణ్ణు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి కౌగ‌లించుకుంటేనే టాబ్లెట్ వేసుకుంటాన‌ని మొండికేసిన సిరి!

టికెట్ టు ఫినాలే రేసులో ష‌ణ్ముఖ్ సైతం వెన‌క‌ప‌డి పోయాడు. ఫ‌స్ట్ ప్లేస్‌లో మాన‌స్‌, రెండో ప్లేస్‌లో శ్రీ‌రామ్‌చంద్ర నిల‌వ‌గా, సిరి మూడో స్థానాన్ని ద‌క్కించుకుంది. ఆరు, ఏడు స్థానాల్లో నిలిచిన ప్రియాంక‌, కాజ‌ల్ పోటీ నుంచి త‌ప్పుకున్నారు. స‌న్నీ, ష‌ణ్ముఖ్ మ‌ధ్య టై కాగా, నాలుగో స్థానానికి జ‌రిగిన పోటీలో స‌న్నీ గెలిచాడు. దీంతో ష‌ణ్ణు ఐదో స్థానానికి ప‌రిమిత‌మ‌య్యాడు. అయిన‌ప్ప‌టికీ అత‌డిని హ‌గ్ చేసుకొని ఓదార్చింది సిరి. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా కౌగిలింత‌ల ప‌రంప‌ర కొన‌సాగుతూనే వ‌స్తోంది. ఆ ఇద్ద‌రూ కౌగిలించుకొని స‌న్నీ త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చినా ప‌ట్టించుకోలేని స్థితిలో ఉన్నారు. స‌న్నీ వ‌చ్చి, ష‌ణ్ణు చేయిప‌ట్టుకోవ‌డంతో అప్పుడు ఈలోకంలోకి వ‌చ్చి, సోఫాలో కూర్చున్న‌వాడ‌ల్లా లేచి నిల్చున్నాడు. స‌న్నీ, ష‌ణ్ణు హ‌గ్ చేసుకున్నారు.

ఐస్ టాస్క్‌లో సిరికి దెబ్బ‌ల త‌గిలిన ద‌గ్గ‌ర్నుంచీ ఆమెను కాలు కింద‌పెట్ట‌నీయ‌కుండా ఎత్తుకొని తిప్పుతూ వ‌చ్చాడు ష‌ణ్ణు. దాంతో ఎప్ప‌టిక‌ప్పుడు అత‌డిని కౌగ‌లించుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ వ‌స్తోందామె. పైగా అత‌డు చూపిస్తున్న అభిమానం లేదా ప్రేమ‌తో అత‌డి ద‌గ్గ‌ర తెగ మారాం చేస్తూ వ‌స్తోంది కూడా. ఒక‌సారైతే త‌ను పిలిచినా ష‌ణ్ణు త‌న ద‌గ్గ‌ర‌కు రాక‌పోవ‌డంతో, నువ్వు నన్ను హ‌గ్ చేసుకుంటేనే టాబ్లెట్ వేసుకుంటాన‌ని ఎమోష‌న‌ల్ బ్లాక్‌మెయిల్ చేసింది కూడా. దీంతో ష‌ణ్ముఖ్ ఆమె ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి, హ‌త్తుకున్నాడు. అయితే దాన్ని ఎవ‌రూ వేరే ర‌కంగా తీసుకోవ‌ద్ద‌ని చెప్ప‌డానిక‌న్న‌ట్లు దాన్ని ఫ్రెండ్‌షిప్ హ‌గ్ అని చెప్పాడు షణ్ణు, కెమెరాల వంక చూస్తూ. ష‌ణ్ణు త‌న‌ను బాగా చూసుకుంటున్నాడ‌ని చెప్తూ, అత‌డిని త‌న మీద‌కు లాక్కుని, ముద్దుకూడా ఇచ్చింది సిరి.

Also read:సిరిపై జెస్సీ షాకింగ్ కామెంట్స్‌

సిరి త‌ల్లి వ‌చ్చి ష‌ణ్ణుది సోద‌ర‌ప్రేమ అని చెప్పినా, లిమిట్స్‌లో ఉండ‌మంటూ ష‌ణ్ణు త‌ల్లి త‌లంటుపోసినా.. ఆ ఇద్ద‌రి రొమాన్స్‌కు ఫుల్‌స్టాప్ ప‌డ‌లేదు. పైగా మ‌రింత ఎక్కువ‌య్యాయి! సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీ‌హాన్ త‌న‌ను వ‌దిలేస్తున్నావా? అని డైరెక్టుగా అడిగిన‌ప్పుడు, రియ‌లైజ్ అయిన‌ట్లు గుంజీలు తీసిన సిరి, య‌థావిధిగా ష‌ణ్ణుపై త‌న ప్రేమ‌ను ప్ర‌ద‌ర్శిస్తూ వ‌స్తోంది. హోస్ట్ నాగార్జున‌తో త‌ను ష‌ణ్ణుకు బాగా క‌నెక్ట్ అయిన‌ట్లు చెప్ప‌డానికి ఆమె సంకోచించ‌లేదు. హౌస్‌లో వారిద్ద‌రి మ‌ధ్య స‌న్నిహిత‌త్వం గురించి ఎలిమినేట్ అయ్యి బ‌య‌ట‌కు వ‌చ్చిన యాంక‌ర్ ర‌వి కూడా చెప్పేశాడు. నిజానికి అత‌డు చెప్పింది చాలా త‌క్కువ‌నీ, హౌస్‌లో ఆ ఇద్ద‌రూ అత్యంత స‌న్నిహితంగా ఉంటున్నార‌నీ, వారిమ‌ధ్య బంధం వేరే లెవ‌ల్‌కు వెళ్లింద‌నీ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజ‌న్ 5 ముగిశాక‌, సిరి-ష‌ణ్ణు ఇద్ద‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చాక వారి మ‌ధ్య బంధం ఎలా ఉంటుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.