షణ్ణు దగ్గరకు వచ్చి కౌగలించుకుంటేనే టాబ్లెట్ వేసుకుంటానని మొండికేసిన సిరి!
టికెట్ టు ఫినాలే రేసులో షణ్ముఖ్ సైతం వెనకపడి పోయాడు. ఫస్ట్ ప్లేస్లో మానస్, రెండో ప్లేస్లో శ్రీరామ్చంద్ర నిలవగా, సిరి మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఆరు, ఏడు స్థానాల్లో నిలిచిన ప్రియాంక, కాజల్ పోటీ నుంచి తప్పుకున్నారు. సన్నీ, షణ్ముఖ్ మధ్య టై కాగా, నాలుగో స్థానానికి జరిగిన పోటీలో సన్నీ గెలిచాడు. దీంతో షణ్ణు ఐదో స్థానానికి పరిమితమయ్యాడు.