English | Telugu

బిగ్ బాస్ హౌసా, హ‌గ్ బాస్ హౌసా.. నాగ్ పై మ‌ళ్లీ ట్రోల్స్ షురూ!

బిగ్‌ బాస్ సీజ‌న్ 5 ఎండింగ్‌కి ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ నెట్టింట విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది. ఒక ర‌కంగా చెప్పాలంటే బిగ్‌బాస్ సీజ‌న్ 5 క్లైమాక్స్‌కి చేరింది. అయితే కంటెస్టెంట్‌ల ప‌రంగానూ.. హోస్ట్ ప‌రంగానూ విమ‌ర్శ‌లు ఎదుర్కొంటూనే వుంది. ఇటీవ‌ల ష‌ణ్ణు, సిరిల కార‌ణంగా హోస్ట్‌గా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న కింగ్ నాగార్జున తాజాగా మరోసారి వారి కార‌ణంగానే ట్రోలింగ్‌కి గురవుతున్నారు. శ‌నివారం ఎపిసోడ్ కార‌ణంగా మ‌రోసారి నాగార్జున నెటిజ‌న్‌ల‌కు అడ్డంగా దొరికి పోయారు.

Also read:ఓట‌మి భ‌యంలో ష‌న్ను.. స‌న్నీ ఫ్యాన్స్‌పై కామెంట్స్‌

శ‌నివారం 91వ ఎపిసోడ్ సంద‌ర్భంగా కంటెస్టెంట్‌ల ముందుకొచ్చిన నాగార్జున ష‌ణ్ణు, సిరిల‌పై ప్ర‌త్యేక ప్రేమ‌ని చూపించ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ప్ర‌స్తుతం హౌస్‌లో ఏడుగురు స‌భ్యులున్నారు. ఇందులో ఐదుగురు స‌భ్యులు నామినేష‌న్స్‌లో వున్నారు. టిక్కెట్ టు ఫినాలే టాస్క్‌లో గెలుపొందిన శ్రీ‌రామ‌చంద్ర టైటిల్‌ని ద‌క్కించుకుని టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట‌మొద‌టి కంటెస్టెంట్‌గా నిలిచాడు. అంత‌కు ముందు హౌస్‌లో ఏం జ‌రిగింది? .. స‌భ్యుల మ‌ధ్య ఎలాంటి సంవాదం నెల‌కొంద‌న్న‌ది చూపించిన నాగార్జున ఈ సంద‌ర్భంగా సిరి, ష‌ణ్ణుల‌పై ప్ర‌త్యేక ప్రేమ‌ని చూపించ‌డం ప్రేక్ష‌కుల‌తో పాటు నెటిజ‌న్‌ల‌కు న‌చ్చ‌లేదు.

Also read:ష‌ణ్ణు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి కౌగ‌లించుకుంటేనే టాబ్లెట్ వేసుకుంటాన‌ని మొండికేసిన సిరి!

కంప్లైంట్ బాక్స్ టాస్క్ సంద‌ర్భంగా సిరిని ప్ర‌త్యేకంగా అడిగారు నాగార్జున‌. వెంట‌నే ష‌ణ్ణుపై కంప్లైంట్ అంటూ అత‌ని ఫొటో తీసి కంప్లైంట్ రాసింది సిరి. అయితే "ఏంటా కంప్లైంట్?"అని నాగ్ అడిగితే... "న‌న్ను బాగానే చూసుకుంటున్నాడు కానీ.,. తిడుతున్నాడు" అని చెప్పింది. `ఏం చేస్తాడు.. నువ్వు ఫ్రెండ్ అని చెప్ప‌డానికి సిగ్గుప‌డుతున్నాడు.. అయినా నువ్వు ఫ్రెండ్లీ హ‌గ్‌లు ఇస్తూనే వున్నావ్ క‌దా` అని నాగ్ అనడంతో.. సిరి పెద్ద‌గా న‌వ్వుతూ... `మా మ‌మ్మీకి ఫ్రెండ్షిప్ హ‌గ్ అని చెబుతూనే వున్నాడు సార్' అంది సిరి. వెంట‌నే నాగ్ `ష‌ణ్ణూ జాగ్ర‌త్త‌గా చూసుకోరా?' .. అన‌డంతో నెటిజ‌న్స్ ఇదేంటీ నాగ్ వాళ్ల హ‌గ్గుల‌ని ఎంక‌రేజ్ చేయ‌డం ఏంటీ.. ఇది బిగ్ బాస్ హౌస్‌నా లేక హ‌గ్‌బాస్ హౌస్‌నా అని సెటైర్లు వేస్తున్నారు. ఈ అరాచ‌కం ఇంకెన్ని రోజులు బాబోయ్ అని త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.