English | Telugu

కొవిడ్ నుంచి కోలుకున్న క‌మ‌ల్ బిగ్ బాస్ హోస్ట్‌గా తిరిగొచ్చారు!

క‌మ‌ల్ హాస‌న్ బిగ్ బాస్ త‌మిళ్ సీజ‌న్ 5కి హోస్ట్‌గా తిరిగొచ్చారు. కొవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో గ‌త రెండు వారాలుగా ఆయ‌న చెన్నైలోని శ్రీ‌రామ‌చంద్ర మెడిక‌ల్ సెంట‌ర్‌లో ఐసోలేష‌న్‌లో ఉన్నారు. అందువ‌ల్ల రెండు వారాల పాటు వీకెండ్ ఎపిసోడ్‌ల‌ను ఆయ‌న హోస్ట్ చేయ‌లేక‌పోయారు. ఇప్పుడు కొవిడ్ నుంచి కోలుకున్న ఆయ‌న ఆ రియాల్టీ షోకు హోస్ట్‌గా మ‌ళ్లీ వ‌చ్చేశారు.

డిసెంబ‌ర్ 4న ఉద‌యాన్నే క‌మ‌ల్ చెన్నై హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ వెంట‌నే ఆయ‌న ప‌నిలోకి రావ‌డం, బిగ్ బాస్ త‌మిళ్ సీజ‌న్ 5 శ‌నివారం (డిసెంబ‌ర్ 4) ఎపిసోడ్‌ను హోస్ట్ చేయ‌డం జ‌రిగిపోయాయి. విజ‌య్ టెలివిజ‌న్ అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్ క‌మ‌ల్ న‌టించిన ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ప్ర‌సారం చేసింది.

'హే రామ్' థీమ్ మ్యూజిక్ బ్యాగ్రౌండ్‌లో న‌డుస్తుండ‌గా, క‌మ‌ల్ హాస‌న్‌, "మీ ప్రేమ కార‌ణంగా నేనిక్క‌డ నిల‌బ‌డి ఉన్నాను. నేనెప్పుడూ మీ వాడినే. నా అబ్జ‌ర్వేష‌న్ ప్ర‌కారం, ఈ సీజ‌న్‌లోని కంటెస్టెంట్లు వారి ఇండివిడ్యువ‌ల్ గేమ్స్‌ను ఆడుతుండ‌టం చూస్తున్నాను. వారంద‌రికీ త‌మ‌వైన వ్యూహాలు ఉన్నాయి. దాని ప‌రిణామాల‌ను ఈరోజు ఎపిసోడ్‌లో చూస్తాం" అని చెప్ప‌డం విన‌వ‌చ్చు.

న‌వంబ‌ర్ 22న‌ క‌మ‌ల్‌కు కొవిడ్ 19 సోకిన‌ట్లు నిర్ధార‌ణ అవ‌డంతో చెన్నైలోని శ్రీ‌రామ‌చంద్ర మెడిక‌ల్ సెంట‌ర్‌లో చేరారు. 'హౌస్ ఆఫ్ ఖ‌ద్ద‌ర్' అనే సొంత బ్రాండ్ క్లాతింగ్‌ను ప్రారంభించేందుకు అమెరికా వెళ్లిన‌ప్పుడు త‌న‌కు వైర‌స్ సోకింద‌ని ఆయ‌న చెప్పారు. క‌మ‌ల్‌ హాస్పిట‌ల్‌లో ఉన్నందున, ఆయ‌న ప్లేస్‌లో హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన ర‌మ్య‌కృష్ణ త‌న ప‌నిని అద్భుతంగా నిర్వ‌ర్తించింది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.