English | Telugu

అబ్బాయితో ఫినిష్‌.. ఇక బాబాయ్ వంతు

తెలుగులో ప్ర‌స్తుతం టాక్ షోల హ‌వా న‌డుస్తోంది. దీంతో ఈ టాక్ షోల‌ని చాలా ప్ర‌త్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. ఇందు కోసం చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ వీవ‌ర్స్‌ని ఎంత‌గా ఎట్రాక్ట్ చేయ‌డంతో పాటు స‌ర్‌ప్రైజింగ్ చేయాలా అని నిర్వాహ‌కులు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ విష‌యంలో `ఆహా` ఓటీటీ ముందు వ‌రుస‌లో నిలుస్తోంది. ముందు స‌మంత‌తో సెల‌బ్రిటీల‌ ఇంట‌ర్వ్యూల‌కు సంబంధించిన టాక్ షోని ప్రారంభించి ఆక‌ట్టుకున్న ఆహా నిర్వాహ‌కులు తాజాగా కొత్త టాక్‌ షోని ప్రారంభించిన విష‌యం తెలిసిందే.

`అన్ స్టాప‌బుల్ `పేరుతో నిర్వ‌హిస్తున్న ఈ టాక్ షోకు హోస్ట్‌గా నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. క‌లెక్ష‌న్‌కింగ్ మోహ‌న్‌బాబు తొలి గెస్ట్ గా ఈ టాక్ షోని ప్రారంభించ‌డం, బాల‌య్య మార్కు అభిన‌యంతో చెల‌రేగిపోవ‌డంతో అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఈ షో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. దీంతో త‌దుప‌రి ఎపిసోడ్‌ని మ‌రింత భారీ స్థాయిలో ప్లాన్ చేయాల‌ని నిర్వాహ‌కులు ఏర్పాట్లు చేశారు. ఇందు కోసం ఏకంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుని రంగంలోకి దించేస్తున్నారు.

బిగ్ బాస్ హౌసా, హ‌గ్ బాస్ హౌసా.. నాగ్ పై మ‌ళ్లీ ట్రోల్స్ షురూ!

ఇటీవ‌ల జెమినీ టెలివిజ‌న్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా నిర్వ‌హిస్తున్న `ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు` లో మ‌హేష్ త‌ళుక్కున మెరిసి స‌ర్‌ప్రైజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ ఎపిసోడ్ ఓ రేంజ్‌లో బంప‌ర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఇదే త‌ర‌హాలో `ఆహా` కోసం `అన్ స్టాప‌బుల్‌`లో బాల‌య్య‌తో క‌లిసి మ‌హేష్ సంద‌డి చేయ‌బోతున్నారు. వ‌చ్చే వారం ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్ప‌టికే బ‌య‌టికి రావ‌డంతో అంద‌రిలోనూ ఆస‌క్తి మొద‌లైంది. బాల‌య్య - మ‌హేష్‌ల మ‌ధ్య సంభాష‌ణ‌లు ఎలా వుంటాయి? .. మ‌హేష్ రియాక్ష‌న్ ఎలా వుంటుంది అన్న‌ది వీక్ష‌కుల్ని మ‌రింత స‌ర్‌ప్రైజ్ కి లోను చేస్తోంది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.