English | Telugu

ఈ ఇద్ద‌రిలో ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రు?

బిగ్‌బాస్ సీజ‌న్‌5 ఎండింగ్‌కు చేరుకుంది. విమ‌ర్శ‌లు నేప‌థ్యంలో ముందుకు సాగుతున్న బిగ్‌బాస్ తాజాగా 13వ వారం ఎలిమినేష‌న్ రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఈ నేప‌థ్యంలో కంటెస్టెంట్‌ల‌లో టెన్ష‌న్ మొద‌లైంది. ఈ శ‌నివారం ఎలిమినేష‌న్స్‌లోవున్న వాళ్ల‌లో ఎవ‌రు ఎలిమినేట్ కాబోతున్నార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. 19 మంది స‌భ్యుల‌తో మొద‌లైన ఈ షోలో ప్ర‌స్తుతం 7 స‌భ్యులు మాత్ర‌మే మిగిలారు. ఇందులో ఎవ‌రు టాప్ ఫైకి చేర‌తార‌న్న‌ది ప్ర‌స్తుతం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఈ 13వ వారం ఎలిమినేష‌న్ లో వున్న వాళ్ల‌లో ఈ ఇద్ద‌రు కంటెస్టెంట్‌ల‌లో ఒక‌రు బ‌య‌టికి వెళ్లే అవ‌కాశం వుంద‌ని తాజాగా తెలుస్తోంది. ఆ ఇద్ద‌రు స‌భ్యులు మ‌రెవ‌రో కాదు ఒక‌రు కాజ‌ల్‌, మ‌రొక‌రు ప్రియాంక‌.ఈ వారం స‌న్నీ, ష‌ణ్మ‌ఖ్ మిన‌హా మిగిలిన ఇంటి స‌భ్యులైన ప్రియాంక‌, కాజ‌ల్‌, సిరి, మాన‌స్‌, శ్రీ‌రామ‌చంద్ర వున్నారు. ఈ స‌భ్యుల్లో శ్రీ‌రామ‌చంద్ర కు ఓటింగ్ భారీ స్థాయిలో వుంది. అంటే ను ఈవారం సేఫ్ అవుతాడ‌న్న‌మాట‌. మాన‌స్ కూడా కొంత ఓటింగ్ ప‌రంగా ముందు వ‌రుస‌లోనే వున్నాడు. ఇక మిగిలిన సిరి, ప్రియాంక‌, కాజ‌ల్‌లే వెన‌క‌బ‌డి వున్నారు.

ఈ ముగ్గురిలో గ‌త వార‌మే ఒక‌రు ఎలిమినేట్ కావాల్సింది. కానీ కాజ‌ల్‌ని స‌న్నీ ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్‌తో కాపాడిన విష‌యం తెలిసిందే. సిరిని ప‌క్క‌న పెడితే ఈ వారం ప్రియాంక లేదా కాజ‌ల్ బ‌య‌టికి వెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. కార‌ణం వారి ఓటింగ్. అయితే ఎలిమినేష‌న్ జ‌న్యూన్‌గా జ‌రిగితే మాత్రం ప్రియాంక కాకుండా కాజ‌ల్ ఈ వారం బ‌య‌టికి వెళ్లే అవ‌కాశాలు వున్న‌ట్టుగా తెలుస్తోంది. ఏం జ‌ర‌గ‌నుందో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.