English | Telugu

`బిగ్‌బాస్‌` నుంచి ఆమె ఎలిమినేట్‌!

బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఎండింగ్‌కి చేరుకుంది. మ‌రో కొన్ని వారాల్లో ఈ సీజ‌ర్ ముగియ‌బోతోంది. ఇక గ‌తంలో ఏ సీజ‌న్‌పై రాన‌న్ని విమ‌ర్శ‌లు ఈ సీజ‌న్‌పై వినిపిస్తున్నాయి. స్వ‌యంగా హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న కింగ్ నాగ్‌పై కూడా ఇటీవ‌ల విమ‌ర్శ‌లు వినిపించాయి. అంతే కాకుండా ఇటీవ‌ల 12వ వారం జ‌రిగిన యాంక‌ర్ ర‌వి ఎలిమినేష‌న్ కూడా వివాదాస్ప‌దంగా మారింది. అత‌న్ని కావాల‌నే ఎలిమినేట్ చేశారంటూ అత‌ని ఫ్యాన్స్ అన్న‌పూర్ణ స్టూడియోస్ వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగ‌డం తెలిసిందే.

ఇదిలా వుంటే ఈ 13వ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ‌ర‌న్న‌దివి ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ 13 వారం ఎలిమినేష‌న్స్‌లో శ్రీ‌రామ‌చంద్ర‌, మాన‌స్‌, సిరి, కాజ‌ల్‌, ప్రియాంక వున్నారు. అయితే ఈ ఐదుగురిలో ఒక‌రు మాత్రం ఈ శ‌నివారం ఎలిమినేట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ముందు నుంచి ప్రాచారం జ‌రుగుతున్న‌ట్టుగా ఈ వారం కాజ‌ల్ ఎలిమినేట్ కావ‌డం లేదు. పింకీ.. ప్రియాంక ఎలిమినేట్ అయిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఎలిమినేష‌న్ రౌండ్‌లో వున్న శ్రీ‌రామ‌చంద్ర అత్య‌ధిక ఓట్ల‌తో ముందు వ‌రుస‌లో నిల‌బ‌డి ఎలిమినేష‌న్ క‌రౌండ్‌లో విజ‌యం సాధించాడు. అత‌ని త‌ర‌హాలోనే మాన‌స్‌, సిరి కూడా అత్య‌ధిక ఓటింగ్ కార‌ణంగా సేఫ్ అయ్యారు. ఇక మిగిలిన ఇద్ద‌రు కాజ‌ల్‌, ప్రియాంక‌. ఈ ఇద్ద‌రిలో ఓటింగ్ శాతం దారుణంగా ప‌డిపోయిన కార‌ణంగా ప్రియాంక శ‌నివారం ఎలిమినేట్ అవుతున్నట్టు తెలిసింది. అస‌లు ఏం జ‌రిగిందో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.