నేను సినిమాలు చేయడం మా ఆయనకు ఇష్టంలేదు!
కొణిదెల వారి గారాలపట్టి నిహారిక పెళ్లికి ముందు నాలుగు సినిమాలు చేసింది. 'ఒక మనసు'తో హీరోయిన్గా పరిచయమైన ఆమె, తర్వాత 'హ్యాపీ వెడ్డింగ్', 'ఒరు నల్ల నాల్ పాతు సొల్రేన్', 'సూర్యకాంతం' సినిమాల్లో నటించింది. గత ఏడాది చైతన్య జొన్నలగడ్డతో వివాహం తర్వాత సినిమా నటనకు దూరమైంది. భర్తకు ఇష్టం లేకపోవడం వల్లే తను సినిమాలు చేయట్లేదని ఆమె చెప్పింది.