English | Telugu

జ‌బ‌ర్ద‌స్త్.. ఇంద్ర‌జ పెళ్లికి అతిథులు 13 మందేన‌ట‌!

సుడిగాలి సుధీర్‌, కిరాక్ ఆర్పీ కార‌ణంగా జ‌బ‌ర్ద‌స్త్ షో కాస్తా గ‌త కొన్ని రోజులుగా ర‌చ్చ ర‌చ్చ‌గా మారిన విష‌యం తెలిసిందే. ఆర్పీ విమ‌ర్శ‌ల‌కు హైప‌ర్ ఆదితో పాటు ఆటో రాంప్ర‌సాద్ కౌంట‌ర్లు ఇస్తూ వ‌చ్చారు. తాజాగా ఈ షో మాజీ మేనేజ‌ర్ కిరాక్ ఆర్పీతో పాటు సుడిగాలి సుధీర్ ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతో మ‌ళ్లీ జ‌బ‌ర్ద‌స్త్ షో వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తోంది. ఇదిలా వుంటే ప్ర‌తీ గురువారం అంద‌ర్నీ న‌వ్విస్తూ ఎంట‌ర్ టైన్ చేస్తున్న కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్.

గ‌త కొంత కాలంగా హాస్య ప్రియుల్ని ఈ షో విశేషంగా ఆక‌ట్టుకుంటూ మంచి టీఆర్పీ రేటింగ్ ని సొంతం చేసుకుంటోంది. తాజా ఎపిసోడ్ కోసం స‌రికొత్త స్కిట్ల‌తో సిద్ధ‌మైంది. ఈ నెల 21న ఈటీవీలో ప్ర‌సారం కానున్నఈ షోకు సంబంధించిన తాజా ప్రోమోని రీసెంట్ గా విడుద‌ల చేశారు. ఈ ఎపిసోడ్ లో క‌మెడియ‌న్ వెంకీ వైఫ్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌బోతోంది. వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ ప్ర‌యాణం ఎలా సాగిందో తాజా ఎపిసోడ్ లో చెప్పేశారు.

ఇక ఇదే వేదిక‌పై త‌న‌ది ప్రేమ పెళ్ల‌ని చెప్పిన వెంకీ ఆ వెంట‌నే ఇంద్ర‌జ పెళ్లి గురించి అడిగాడు. మీది అరేంజ్ మ్యారేజా లేక ల‌వ్ మ్యారేజా అని అడిగితే ఇంద్ర‌జ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని వెల్ల‌డించింది. మాది ల‌వ్ మ్యారేజ్ అని, పెళ్లికి కేవ‌లం 13 మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యార‌ని, పెళ్లికి అయిన ఖ‌ర్చు 7,500 మాత్ర‌మేన‌ని చెప్పి షాకిచ్చింది. ఇదే సంద‌ర్భంగా మ‌నో పెళ్లి గురించి అన‌సూయ అడ‌గ‌డంతో ఆయ‌న కూడా త‌న పెళ్లిగురించి చెప్పేశారు. త‌ను చిన్న వ‌య‌సు నుంచే సంపాదించ‌డం మొద‌లు పెట్టాన‌ని, అందుకే త‌న‌కు 19 ఏళ్ల వ‌య‌సులోనే పెళ్లి చేశార‌ని చెప్పేశాడు. ఈ నెల 21న ఈ ఎపిసోడ్ ప్ర‌సారం కానుంది.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.