English | Telugu
కామెంట్ల బురదలో ఇరుక్కుపోయిన జబర్దస్త్
Updated : Jul 16, 2022
జబర్దస్త్ కమెడియన్స్ చేస్తున్న రచ్చకు బుల్లి తెర షేక్ ఐపోతోంది. కిర్రాక్ ఆర్పీ చేస్తున్న వ్యాఖ్యలు మిగతా వాళ్ళు చేస్తున్న ఖండనలు చూస్తుంటే ఎవరి వాదన కరెక్ట్ అనే విషయం మాత్రం ఎవరికీ క్లారిటీ రావడం లేదు. ఈ నేపథ్యంలో నిర్మాత చిట్టిబాబు కిర్రాక్ ఆర్పీ మీద విరుచుకుపడ్డారు. జబర్దస్త్ లోపల అసలేం జరుగుతోంది అనే విషయాలపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. మల్లెమాలను, జబర్దస్త్ ని, షేకింగ్ శేషుని, శ్యాంప్రసాద్ రెడ్డిని ఒక రేంజ్ లో ఆడేసుకున్నాడు ఆర్పీ. ఈ కామెంట్స్ అన్నిటికీ బ్రేక్ వేస్తూ ఇంకొంతమంది సీనియర్ కమెడియన్స్ రంగంలోకి దిగి ఆర్పీకి కౌంటర్ అటాక్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఆర్పీ మీద వ్యక్తిగత దూషణకు దిగారు ప్రొడ్యూసర్ చిట్టిబాబు. "ఒక అడ్రస్ లేనివాడికి జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది.
ఆర్పీ తినేది అసలు అన్నమేనా" అంటూ చాల ఘాటుగా స్పందించారు."ఆర్పీ నమ్మకద్రోహి" అంటూ ఒక వీడియో కూడా చూపించాడు. టాలెంట్ ఉన్నా అవకాశాలు లేక బోల్డు మంది బయట ఉన్నారు. "జబర్దస్త్ అనే వేదిక అలాంటి వాళ్లకు ఎంతో చేసింది. ఈ వేదిక అనేదే లేకపోతే ఆర్పీ ఎవడో ఎవరికీ తెలిసేదే కాదు అన్నారు. ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నాడు అంటూ మండిపడ్డారు. ఇప్పుడు ఒక పేరు , గుర్తింపు వచ్చేసింది కాబట్టి తనకు లైఫ్ ఇచ్చిన వేదికను ఎన్నైనా తిట్టొచ్చు" అన్నారు. చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం లేపుతున్నాయి. ఆర్పీ కామెంట్స్ వింటున్న సీనియర్ కమెడియన్స్ ఒక్కొక్కరిగా వచ్చి వేరే వేరే వేదికలపై ఖండించడం చూస్తూనే ఉన్నాం. ఇన్నాళ్ల నుంచి మచ్చ లేని జబర్దస్త్ పై ఇప్పుడు ఇలా బురద జల్లడం అవసరమా అంటూ కూడా కొంతమంది ఆడియన్స్ అడుగుతున్నారు.