English | Telugu

ఆర్పీ చెప్పినవన్నీ నిజాలే.. అబద్ధాలు కావు!

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయ్యి ఇప్పుడు ఆ షో గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ వార్తల్లో నిలిచాడు కిర్రాక్ ఆర్పీ. మల్లెమాల ఎవరికీ సహాయం చేయదు అని అక్కడ ఫుడ్ సరిగా పెట్టరు అని, పేమెంట్ రెగ్యుల‌ర్‌గా ఇవ్వరని.. ఇలా ఎన్నో కామెంట్స్ వింటూనే ఉన్నాం. ఐతే ఇప్పుడు ఆర్పీ చేసిన కామెంట్స్ కి మద్దతు ఇస్తున్నారు రాకేష్ మాస్టర్. మల్లెమాలలో తన అనుభవాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బులెట్ భాస్కర్ కోరిక మేరకు పిలిస్తే అతని టీమ్ లో చేశానని చెప్పారు. ఆయన టీం మెంబెర్స్ ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవారని, భోజనాన్ని స్వయంగా ఆయనే తీసుకొచ్చేవారని కూడా తెలిపారు.

కానీ ఒక సందర్భంలో భాస్కర్ లేకపోయేసరికి తాను కూడా అందరి లాగే భోజనం కోసం క్యూలో నిలబడాల్సి వచ్చిందన్నారు. అక్కడ భోజనం అస్సలు బాగోదంటూ ఆరోపించిన ఆర్పీ మాటలు నిజమే అన్నారు రాకేష్ మాస్టర్. భాస్కర్ అక్కడి భోజనం బాగోకపోవడం వల్లనే బయటి నుంచి తనకు, తన టీమ్ మెంబర్స్‌కు తెప్పించేవాడని చెప్పారు. "మల్లెమాలలో భోజనాలు బాగుంటే బయటినుంచి తెప్పించుకోరు కదా" అన్నారు.

ఇదే కాకుండా ఇంకొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు రాకేశ్ మాస్ట‌ర్‌. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌ వాళ్లకు అమ్మాయిల పిచ్చి ఎక్కువని, ఎప్పుడూ ఒకరో ఒక అమ్మాయితో ఎకసెక్కాలు చేస్తూనే ఉంటారని కూడా కామెంట్ చేశారు. జబర్దస్త్ డైరెక్టర్ వస్తే అందరూ లేచి నిలబడాలి అన్నారు మాస్టర్. ఇకపోతే "ఆర్పీ చెప్పినవన్నీ నిజాలే, అబద్ధాలు ఎంత మాత్రం కావు" అంటూ సపోర్ట్ చేశారు.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.