English | Telugu
బ్రేక్ ది రూల్స్ అంటున్న ఏజెంట్
Updated : Jul 16, 2022
తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ఆహా ఎప్పుడూ కొత్త కొత్త పద్ధతులను అన్వేషిస్తూ ముందుకెళ్తోంది. కొత్త కొత్త సబ్జెక్ట్స్ తో వెబ్ సిరీస్ ని కూడా ఆడియన్స్ ముందుకు తెస్తూ అలరిస్తూ ఉంది. క్వాంటిటీ, క్వాలిటీకి పెద్ద పీట వేస్తూ వెళ్తున్న ఆహా వేదిక పై ఇప్పుడు షణ్ముఖ్ జస్వంత్ ఏజెంట్ ఆనంద్ సంతోష్ వెబ్ సిరీస్ సందడి చేయబోతున్నాడు. షన్ను లీడ్ రోల్ లో నటించిన సిరీస్ ఇది. ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ ని ఇటీవల రిలీజ్ చేశారు. "మనిషి బతకడానికి జీవితంలో కొన్ని రూల్స్ పెట్టుకుంటాడు..ఆ రూల్స్ ని బ్రేక్ చేస్తే " అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలౌతుంది. ఇలాంటి రూల్స్ లేకుండా ఉండడానికి ఉద్యోగం మానేసి డిటెక్టివ్ ఏజెంట్ అవతారం ఎత్తుతాడు సంతోష్. ఆ తర్వాత ఆ ఏజెంట్ దగ్గరకు సిల్లీ, పెట్టీ కేసులు వస్తూ ఉంటాయి. టింకు గాడి ఇంట్లో క్రికెట్ బ్యాట్లు పోయాయని, పక్కింటి సుశీల ఆంటీ ఇంట్లో రోజూ చెప్పులు పోతున్నాయని ఇలాంటి కేసులు అన్నమాట.
ఇక అదే సమయంలో "కూకట్ పల్లిలో కిడ్నాపులు, మీ అమ్మాయి మీ ఇంట్లో ఉందా ? " అనే బ్రేకింగ్ న్యూస్ చూస్తాడు. అప్పుడే అమ్మాయి మిస్ ఐన కేసు ఒకటి ఆనంద్ దగ్గరకు వస్తుంది. ఇక ఈ కేసు సాల్వ్ చేసే టైంలో ఎలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేసాడు అనేదే స్టోరీ లైన్.. ఈ ట్రైలర్ లో కామెడీ కూడా మస్త్ ఎంటర్టైన్ చేసేదిగా ఉంది. ఇక ఈ వెబ్ సిరీస్ జులై 22 నుంచి ఆహాలో స్ట్రీమ్ కాబోతోంది . ఆహా బెస్ట్ కంటెంట్ నే ఎప్పుడూ ఆడియన్స్ కి అందిస్తూ ఉంటుంది. సామ్-జామ్, అన్ స్టాపబుల్ , తెలుగు ఇండియన్ ఐడల్ వంటి షోస్ ని ప్రారంభించి ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. ఇక ఇప్పుడు ఏజెంట్ ఆనంద్ సంతోష్ తో రాబోతోంది ఆహా..